అవినీతి నిరోధక నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ 282 మిలియన్ డాలర్ల జరిమానా చెల్లించేందుకు సిద్ధమైంది.జరిమానా
ఎందుకంటే...
భారత్, చైనా, బ్రెజిల్, మెక్సికోల్లో నిర్వహిస్తున్న వాల్మార్ట్ వ్యాపారాల్లో మధ్యవర్తులు సహేతుకమైన కారణాలు వెల్లడించకుండా.. విదేశీ ప్రభుత్వ అధికారులకు చెల్లింపులు చేశారనే ఆరోపణలతో ఈ జరిమానా విధించింది అమెరికా సెక్యూరిటీస్, ఎక్ఛేంజి కమిషన్(ఎస్ఈసీ). ఈ కారణంగా ఎస్ఈసీ ఆదేశాలు అమలు చేసే 'విదేశీ అవినీతి పద్ధతుల చట్టం(ఎఫ్సీపీఏ)' ద్వారా చర్యలకు సిద్ధమైనట్లు పేర్కొంది.
ఈ జరిమానాలో 144 మిలియన్ డాలర్లు ఎస్ఈసీకి, 138 మిలియన్ డాలర్లు ఎఫ్సీపీఏలో నమోదైన క్రిమినల్ ఆరోపణలు ఎత్తివేసేందుకు చెల్లించాలని వాల్మార్టుకు నోటీసులు ఇచ్చింది.