ETV Bharat / business

భారత విపణిలోకి త్వరలోనే రెమిడెసివిర్‌​! - US pharma firm Gilead Sciences

భారత్​లోకి యాంటీ-వైరస్​ ఔషధం రెమిడెసివిర్​ను త్వరలోనే తీసుకువచ్చేందుకు ఆసక్తి చూపుతోంది అమెరికా ఔషధ సంస్థ గిలీడ్​ సైన్సెస్​. ఈ మేరకు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ, డీసీజీఐ అధికారులతో సమావేశమయ్యారు సంస్థ ప్రతినిధులు. మార్కెట్​ అనుమతుల కోసం త్వరలోనే దరఖాస్తు చేసే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి.

Gilead Sciences
భారత విపణిలోకి త్వరలోనే రెమిడెసివిర్‌​!
author img

By

Published : May 22, 2020, 6:15 AM IST

కరోనా వైరస్‌ బాధితులకు ఉపశమనం కలిగిస్తున్న యాంటీ-వైరల్‌ ఔషధం 'రెమిడెసివిర్‌' త్వరలోనే భారత విపణిలోకి తీసుకువచ్చేందుకు ముమ్మర చర్యలు చేప్టటింది అమెరికా సంస్థ గిలీడ్‌ సైన్సెస్‌. త్వరలోనే భారత కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ (సీజీఎస్​సీఓ)కు దరఖాస్తు చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈ మేరకు గిలియాడ్​ సైన్సెస్​ ప్రతినిధులు బుధవారం (మే 20న) కేంద్ర ఆరోగ్య శాఖ, డ్రగ్​ కంట్రోలర్​ జనరల్​ ఆఫ్​ ఇండియా (డీసీజీఐ) అధికారులుతో సమావేశమైనట్లు వెల్లడించారు. భారత విపణిలోకి ఏ విధంగా తీసుకురావాలనే అంశంపై చర్చించినట్లు తెలిపారు.

" భారత్​లోకి రెమిడెసివిర్‌​ డ్రగ్​ను తీసుకొచ్చేందుకు మార్కెట్​ అనుమతులకు దరఖాస్తు చేయాలని అమెరికా సంస్థ ఆసక్తి చూపుతోంది. నూతన ఔషధానికి అనుమతులు ఇచ్చే రెగ్యులేటరీ విధానాలు వారికి తెలియజేశాం. మొత్తం సౌకర్యాలపై వివరించాం. బోర్డు డైరెక్టర్లతో చర్చించి వివరాలు తెలియజేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అమెరికా ఎఫ్​డీఏ లేదా ఇతర గుర్తింపుపొందిన రెగ్యులేటరీలు ఆమోదం తెలిపిన వివరాల ఆధారంగా.. కొత్త ఔషధం, క్లినికల్​ ట్రయల్స్​ నియమాలు 2019లోని ప్రత్యేక పరిస్థితుల్లో క్లినికల్​ ట్రయల్స్​కు మినహాయింపునిస్తూ రెమిడెసివిర్‌​కు అనుమతించే అవకాశం ఉంది. రెమిడెసివిర్ ‌సామర్థ్యంపై ఇటీవలి ఉమ్మడి పర్యవేక్ష బృందంతో సమావేశంలో చర్చించాం."

– అధికారవర్గాలు

జులై చివరిలో..

గిలీడ్​​ సైన్సెస్​ ఇప్పటికే రెమెడెసివిర్​ ఔషధం తయారీ, విక్రయాల్లో మూడు భారతీయ ఔషధ కంపెనీలను భాగస్వాములుగా చేర్చుకుంది. ఈ మేరకు ఆయా సంస్థలతో నాన్‌-ఎక్స్‌క్లూజివ్‌ లైసెన్సింగ్‌ ఒప్పందం కుదుర్చుకుంది‌. ఇందులో ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న సిప్లా, హైదరాబాద్​ కేంద్రంగా ఉన్న హెటిరో ల్యాబ్స్​, నోయిడాలో ఉన్న జుబిలెంట్​ లైఫ్​ సైన్సెస్ ఉన్నాయి.కేంద్రం నుంచి ఈ నెలలోనే అనుమతులు లభిస్తే.. జులై లేదా ఆగస్టులో సరఫరా ప్రారంభించే అవకాశం ఉంది.

ఎయిమ్స్​లోని 1000 మంది రోగులపై ట్రయల్స్​ చేసేందుకు రెమెడెసివిర్​ సరఫరా చేయాలని కొద్ది రోజుల క్రితం గిలీడ్​కు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాసింది. కానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో పలు సంస్థలు చేస్తున్న క్లినికల్​ ట్రయల్స్​లో పాల్గొనాలని మే 12న వెల్లడించింది సంస్థ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.