ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీకి చెందిన ప్రముఖ పేమెంట్ సేవల సంస్థ స్క్వేర్ బిట్‌కాయిన్‌లో 170 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. ఈ మొత్తం స్క్వేర్ ఇంతకుముందు క్రిప్టోకరెన్సీలో పెట్టిన పెట్టుబడి కన్నా దాదాపు మూడింతలు ఎక్కువ. మొత్తం 3,318 బిట్కాయిన్లను(51,236 డాలర్లకు ఒక కాయిన్) కొనుగోలు చేసినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
బిట్‌కాయిన్ విలువ రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ విలువ 50 వేల డాలర్ల దిగువన ఉంది.
"ఆర్థిక సాధికారతకు, ప్రతిఒక్కరూ ప్రపంచ ద్రవ్య వ్యవస్థలో భాగమయ్యేందుకు, తమ తమ ఆర్థిక భవిష్యత్‌ను సంరక్షించుకునేందుకు క్రిప్టోకరెన్సీ సరిగ్గా ఉపయోగపడుతుందని స్క్వేర్ విశ్వసిస్తోంది. ఈ కారణంగానే బిట్‌కాయిన్‌లో భారీగా పెట్టుబడి పెడుతోంది" అని ఆ సంస్థ తెలిపింది.
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కూడా ఇటీవలే 1.5 బిలియన్ డాలర్లను బిట్‌కాయిన్‌లో పెట్టడం గమనార్హం.
ఇదీ చదవండి:ఒక్క ట్వీట్‌తో మస్క్ సంపద 15 బిలియన్ డాలర్లు ఉఫ్!