ETV Bharat / business

ల్యాప్​టాప్​ల వ్యాపారానికి తొషిబా గుడ్​ బై - ల్యాప్​డాప్​ల వ్యాపారం నుంచి వైదొలిగిన తొషిబా

ల్యాప్​టాప్​ల మార్కెట్​లో ఓ వెలుగు వెలిగిన తొషిబా.. ఇప్పుడు ఆ వ్యాపారాల నుంచి పూర్తిగా తప్పుకుంది. కంపెనీకి చెందిన డైనాబుక్​ ల్యాప్​టాప్​ బ్రాండ్​లో 19.9 శాతం వాటను కూడా షార్ప్​ సంస్థకు విక్రయించింది.

Toshiba out from laptop business
ల్యాప్​డాప్​ల వ్యాపారం నుంచి వైదొలిగిన తొషిబా
author img

By

Published : Aug 10, 2020, 4:15 PM IST

జపాన్‌కు చెందిన టెక్‌దిగ్గజం తొషిబా ల్యాప్‌టాప్‌ల వ్యాపారం నుంచి పూర్తిగా వైదొలగాలని నిర్ణయించుకుంది. కంపెనీ తన డైనాబుక్‌ ల్యాప్‌టాప్‌ బ్రాండ్‌లో 19.9 శాతం వాటాను షార్ప్‌ సంస్థకు విక్రయించింది. దీనితో ఈ వ్యాపారం నుంచి పూర్తిగా వైదొలగినట్లైంది. గతంలోనే 80.1శాతం వాటాను షార్ప్‌కు విక్రయించింది తొషిబా.

"డైనాబుక్‌లోని మిగిలిన 19.9 శాతం వాటాను కూడా షార్ప్ కార్పొరేషన్‌కు బదలాయించాము. దీనితో అధికారికంగా డైనాబుక్‌ ఇప్పుడు షార్ప్‌నకు అనుంబంధ సంస్థగా మారింది" - తొషిబా ప్రకటన

తొషిబా ప్రస్థానం..

1990 నుంచి 2000 వరకు తొషిబా ల్యాప్‌టాప్‌ల తయారీలో టాప్‌ కంపెనీల్లో ఉండేది. ఆ కంపెనీ తయారు చేసిన శాటిలైట్‌ ల్యాప్‌టాప్‌లు భారీ విజయం సాధించాయి. కానీ, తర్వాత లెనోవా, హెచ్‌పీ, డెల్‌ వంటి కంపెనీలు రంగప్రవేశం చేసి ల్యాప్​టాప్​ మార్కెట్​పై భారీగా పట్టు సాధించాయి. వీటి నుంచి తొషిబా తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది.

ఇదీ చూడండి:విదేశాల నుంచి రూ.4 లక్షల కోట్ల బదిలీ తగ్గొచ్చు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.