ETV Bharat / business

2019-20 క్యూ3లో స్వల్పంగా పెరిగిన టీసీఎస్​ లాభం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో టీసీఎస్​ నికర లాభం రూ.8,118 కోట్లుగా ప్రకటించింది సంస్థ. గత ఏడాది ఇదే సమయానికి ఈ లాభం పోలిస్తే 0.2 శాతం అధికం.

TCS
టీసీఎస్​
author img

By

Published : Jan 17, 2020, 4:59 PM IST

ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్​ (టీసీఎస్​) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక లాభాల్లో 0.2 శాతం వృద్ధిని కనబర్చింది. డిసెంబర్​తో ముగిసిన త్రైమాసికానికి రూ.8,118 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించినట్లు సంస్థ ప్రకటించింది.

2018 డిసెంబర్​తో ముగిసిన త్రైమాసికంలో టీసీఎస్​ రూ.8,105 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో సంస్థ రూ.39,854 కోట్ల ఆదాయాన్ని గడించింది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) ఇదే సమయంలో సంస్థ ఆదాయం రూ.37,338 కోట్లుగా ఉంది.

స్వల్ప లాభాలు గడించినా.. రూ.1 విలువైన సంస్థ షేరుపై రూ.5 మధ్యంతర డివిడెండ్​ను ప్రకటించింది టీసీఎస్​.

ఇదీ చూడండి:అమెజాన్​ ఆఫర్​: ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.