స్టాక్ మార్కెట్లు నేడు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 145.84 పాయింట్లు బలపడి 39,127.27 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 30.10 పాయింట్ల స్వల్ప లాభంతో 11,754.85 పాయింట్ల వద్ద ఉంది.
ఇవీ కారణాలు
ఆర్థిక, వాహన రంగాల్లో సాగుతున్న కొనుగోళ్లు మార్కెట్లకు కలిసొచ్చింది. విదేశీ పెట్టుబడులు రావటం, చమురు ధరలు అదుపులో ఉండటం సానుకూల ట్రేడింగ్‌కు కారణం.
లాభానష్టాల్లోనివే
సెన్సెక్స్‌లో టాటా మోటార్స్, భారతీ ఎయిర్టెల్, కొటక్ బ్యాంకు, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, మారుతి షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, టాటా స్టీల్, వేదాంత, హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో సాగుతున్నాయి.
రూపాయి, ముడి చమురు
ఆరంభ ట్రేడింగ్‌లో రూపాయి స్వల్పంగా పుంజుకుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 69.28 వద్ద ట్రేడవుతోంది.
ముడి చమురు ధరల సూచీ బ్రెంట్ 0.40 శాతం తగ్గి.. బ్యారెల్ ముడి చమురు ధర 70.47 డాలర్లుగా కొనసాగుతోంది.
ఇతర మార్కెట్లు ఇలా
ఆసియాలోని ఇతర ప్రధాన మార్కెట్లు.... కొరియా సూచీ కోస్పి, హంకాంగ్ సూచీ హంగ్ సెంగ్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. చైనా, జపాన్ స్టాక్ మార్కెట్లకు నేడు సెలవు.