ETV Bharat / business

సామాజిక దూరంపై దిగ్గజ సంస్థల ప్రచార అస్త్రాలు

author img

By

Published : Mar 29, 2020, 4:36 PM IST

కరోనా కట్టడికి ప్రస్తుతం చాలా దేశాలు లాక్‌డౌన్‌ విధించాయి. ప్రజలు సామాజిక దూరం పాటించాలని ప్రచారం చేస్తున్నాయి. ఇందులో ప్రముఖ సంస్థలూ భాగస్వామ్యమై ప్రజలకు సామాజిక దూరంపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి. మరి ఏఏ సంస్థలు ఎలా సామాజిక దూరంపై ప్రచారం చేస్తున్నాయో తెలుసుకుందాం.

social distancing new mantra in-brand-promotion
సామాజిక దూరానికి బ్రాండెడ్ ప్రచారం

ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా వైరస్‌ గురించే చర్చిస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు ప్రస్తుతమున్న ఏకైక మార్గం సామాజిక దూరం పాటించడమే. దిగ్గజ సంస్థలూ ఇప్పుడు సామాజిక దూరంపై వినూత్న రీతిలో ప్రచారం చేస్తూ ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందులో కొన్ని కంపెనీలు చేస్తున్న ప్రచారాలు మంచి ఆదరణ పొందుతున్నాయి.

మెక్‌డొనాల్డ్స్‌

ప్రపంచంలోనే అతిపెద్ద ఫాస్ట్‌ ఫుడ్‌ గొలుసుకట్టు సంస్థ మెక్‌డొనాల్డ్స్ తనదైన శైలిలో సామాజిక దూరంపై స్పందించింది. ఇందుకోసం మెక్‌డొనాల్డ్స్ లోగో (M)ను విడదీసి సామాజిక దూరం ఆవశ్యకతను తెలియజేసింది. మెక్‌డొనాల్డ్స్ బ్రెజిల్ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో ఇలా లోగోను వేరు చేసిన ఫోటోను షేర్‌ చేసింది. "కొంత కాలం వరకు వేరువేరుగా ఉంటే.. ఎల్లప్పుడూ కలిసే ఉండొచ్చు" అని పోర్చుగ్రీస్ భాషలో ట్యాగ్‌లైన్‌ను జోడించింది. 52 ఏళ్లలో మెక్‌డొనాల్డ్స్‌ లోగోను ఇలా విడదీయడం ఇదే ప్రథమం.

mec donalds
మెక్‌డొనాల్డ్స్‌

మెక్‌డొనాల్డ్స్‌కు చేసిన ఈ పోస్టు మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. బ్రాండ్ పరంగా మాత్రం మంచి ఇమేజిని సొంతం చేసుకుంది.

కోకాకోలా ఏమంటోందంటే..

శీతలపానీయాల సంస్థ కోకాకోలా కూడా సామాజిక దూరంపై ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రఖ్యాత న్యూయార్క్‌ బిల్‌బోర్డ్‌పై 'దూరంగా ఉండటమే.. కలిసి ఉండేందుకు ఉత్తమమైన మార్గం' అనే సందేశాన్ని ఉంచింది. ఈ సందేశంపై కోకాకోలా పేరును విడివిడి అక్షరాలతో రాసింది. న్యూయార్క్‌ ప్రజలను ఇళ్లలోనే ఉండండి అని చెప్పేందుకు ఈ సందేశాన్ని ఉంచింది ఆ సంస్థ.

cocacola
కోకాకోలా

నైకీ సందేశం..

స్పోర్ట్స్‌ దుస్తుల తయారీ సంస్థ నైకీ కూడా సామాజిక దూరం సందేశంతో ట్వీట్‌ చేసింది. నైకీ సందేశాన్ని స్పోర్ట్స్‌ స్టార్ మైకెల్ జోర్డాన్‌ రీట్వీట్‌ చేశారు. కరోనా వ్యాప్తి కారణంగా పలు దేశాల్లో నైకీ స్టోర్లు తాత్కాలికంగా మూతపడ్డాయి.

nike
నైకీ

ఆడీ రింగుల్లో సామాజిక దూరం..

ప్రముఖ కార్లతయారీ సంస్థ ఆడీ వినూత్న రీతిలో సామాజిక దూరంపై అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. ఆడీ కారు ఎంత క్రేజ్‌ ఉందో.. దాని లోగోకు అంతే క్రేజ్‌ ఉంది. నాలుగు రింగులు ఒకదానితో మరోకటి కలిసి ఉండే రింగుల సమూహాన్ని విడివిడిగా పెట్టి సామాజిక దూరం పాటించండి అనే సందేశాన్ని ఇచ్చింది. 'దూరం పాటించండి.. ఒక్కటిగా ఉండండి' అనే సందేశంతో ఓ వీడియోను ట్వీట్‌ చేసింది. సంస్థ వెబ్‌సైట్లోనూ ఈ సందేశాన్ని ఉంచింది.

audi
ఆడీ

జీప్‌ ఇండియా సందేశమిదే..

మరో దిగ్గజ వాహన తయారీ సంస్థ జీప్‌ కూడా సమాజిక దూరంపై వినూత్న సందేశం ప్రచారం చేసింది. "ఒక మంచి కార్యం కోసం మనమంతా ఇప్పుడు ఆగిపోయాం. ఒక అడుగు వెనక్కి వేస్తే.. ఆరోగ్యం పరంగా ముందుకు దూసుకెళ్తాం. ఇంతకు ముందు కన్నా మరింత ఎక్కువ ముందుకెళ్తాం. ఇంట్లో ఉండండి, జాగ్రత్తగా ఉండండి." సామాజిక దూరం, లాక్‌డౌన్‌లు రెండూ జీప్‌ ఇండియాకు మెంటర్‌లు అని ట్వీట్‌ చేసింది.

jeep india
జీప్‌ ఇండియా
jeep india social distancing
జీప్ ఇండియా సందేశం

లిబెరో మ్యాగజైన్‌..

స్పెయిన్‌లో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. ఐరోపాలో ఇటలీ తర్వాత ఈ దేశంపైనే కొవిడ్-19 ప్రభావం అధికంగా ఉంది.

కరోనా కారణంగా స్పెయిన్‌ ఫుట్​బాల్ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోంది. 2016-19 ఆర్థిక సంవత్సరంలో చూస్తే ఈ పరిశ్రమ 15.69 బిలియన్‌ యూరోల టర్నోవర్‌ను సాధించింది. స్పెయిన్‌ జీడీపీలో ఇది 1.37 శాతానికి సమానం. ఈ పరిశ్రమ ఒక్కటే కాదు స్పెయిన్ ఫుట్​బాల్‌ లీగ్‌ లాలిగా ద్వారా క్యాటరింగ్, ఆథిత్యం, బార్లు, దేశీయ టూరిజం వంటి రంగాలు 4 బిలియన్ యూరోల మేర ఆదాయాన్ని గడించాయి. ప్రస్తుతం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి.

అయితే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రముఖ స్పోర్ట్స్‌ మ్యాగజైన్‌ లిబెరో కరోనావైరస్‌పై అవగాహన ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా హోమ్‌ అండ్‌ అవే ఫుట్​బాల్ మ్యాచ్‌ల గణాంకాలను వినియోగిస్తోంది. దీనితో ప్రజలకు ఇళ్లల్లో ఉండటం ఎంత అవసరమో తెలిసేలా చేస్తోంది. ఇందులో దిగ్గజ ఫుట్​బాల్ ఆటగాళ్లు లియోనల్​ మెస్సీ లాంటి వారిపైనా దృష్టి సారించింది.

libero magazine
లిబెరో మ్యాగజైన్‌ ప్రచారం
libero magazine
లిబెరో మ్యాగజైన్‌

భారత్‌లో మీడియా సామాజిక దూరం ప్రచారం..

ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక దూరంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మీడియా ఎంతో కృషి చేస్తోంది. వినూత్న రీతిలో తమ సందేశాలను అందిస్తున్నాయి.

ఇందులో చెప్పుకోవాల్సింది ప్రముఖ వార్తా పత్రిక ది హిందూ గురించి. ఈ పత్రిక సమాజిక దూరంపై ప్రచారం కోసం ఓ పూర్తి పేజీపై "వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇదే సులభమైన మార్గం" అని ఇంగ్లీషులో ప్రచురించింది. ఈ ప్రకటన చాలా మందిని ప్రభావితం చేస్తోంది.

the hindu add
ది హిందూ సందేశం

బెంగాలీ భాషకు చెందిన మరో వార్తా పత్రిక 'సంగ్‌బాద్ ప్రతిదిన్‌' కూడా సరికొత్త పద్ధతిలో సమాజిక దూరాన్ని ప్రోత్సహించేందుకు కృషి చేసింది. ఇందుకోసం ఆ పత్రిక లోగోను విడదీసి ప్రచురించింది.

sangbad pratidin
సంగ్‌బాద్ ప్రతిదిన్‌

ఇదీ చూడండి:గూగుల్​ బంపర్ ఆఫర్​: ఒకేసారి 12 మందితో వీడియో కాల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.