రష్యాకు చెందిన స్పుత్నిక్-వి కరోనా టీకాను దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఇందుకు అనుమతులు కోరుతూ డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కు సీఐఐ దరఖాస్తు చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పరీక్షలు, విశ్లేషణకు అనుమతులు కోరినట్లు తెలుస్తోంది.
స్పుత్నిక్-వి టీకాను దేశంలో ప్రస్తుతం హైదరాబాద్కు చెందిన ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ ఉత్పత్తి చేస్తోంది.
సీరం ప్రస్తుతం కొవిషీల్డ్ టీకాలను తయారు చేస్తోంది. ఈ నెలలో 10కోట్ల డోసులను ఉత్పత్తి చేసి సరఫరా చేయనున్నట్లు ప్రభుత్వానికి ఇదివరకే వెల్లడించింది. మరో కరోనా టీకా నోవావాక్స్ను కూడా ఎస్ఐఐ ఉత్పత్తి చేస్తోంది. అయితే దీని వినియోగానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ అనుమతుల కోసం ఎదురుచూస్తోంది.
ఇదీ చదవండి:Serum: ఫైజర్, మోడెర్నా బాటలోనే సీరం!