ETV Bharat / business

స్టాక్ మార్కెట్ల కుదేలు.. సెన్సెక్స్​ 416 పాయింట్లు పతనం - స్టాక్​ మార్కెట్లు లేటెస్ట్​

చమురు ధరల వృద్ధి, కీలక సంస్థల షేర్ల నష్టాలతో స్టాక్ మార్కెట్లు నేడు కుదేలయ్యాయి. సెన్సెక్స్ 416 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 122 పాయింట్లు క్షీణించింది.

STOCKS CLOSE
స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Jan 20, 2020, 4:01 PM IST

Updated : Feb 17, 2020, 5:46 PM IST

స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ముగిశాయి. హెవీ వేయిట్​ షేర్లయిన రిలయన్స్, కోటక్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, టీసీఎస్​ల నుంచి మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం కారణంగా సూచీలు కుదేలయ్యాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రారంభంలో కాస్త సానుకూలంగా కొనసాగిన సూచీలు.. చమురు ధరల వృద్ధితో కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత ఏ దశలోనూ తేరుకోలేదు.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 416 పాయింట్లు క్షీణించింది. చివరకు 41,529 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 122 పాయింట్ల నష్టంతో 12,231 వద్దకు చేరింది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్​ 42,274 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 41,503 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 12,430 పాయింట్ల అత్యధిక స్థాయి.. 12,217 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

పవర్ గ్రిడ్​ 3.09 శాతం, భారతీ ఎయిర్​టెల్​ 1.38 శాతం, ఐటీసీ 0.85 శాతం, ఏషియన్​ పెయింట్స్​ 0.82 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్​ 0.74 శాతం లాభాలను నమోదు చేశాయి.
కోటక్​ బ్యాంక్​ 4.70 శాతం, రిలయన్స్ 3.08 శాతం, టీసీఎస్​ 2.16 శాతం, ఎన్​టీపీసీ 2.06 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.

రూపాయి

రూపాయి ఇంట్రాడేలో 5 పైసలు క్షీణించి.. డాలర్​తో పోలిస్తే మారకం విలువ రూ.71.13 వద్దకు చేరింది.

ముడి చమురు

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్​ నేడు 0.66 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 65.28 డాలర్ల వద్ద ఉంది.

ఇదీ చూడండి:హల్వా వేడుకతో బడ్జెట్ ముద్రణ షురూ

Last Updated : Feb 17, 2020, 5:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.