ETV Bharat / business

సౌదీ ఆరాంకో లాభాలకు భారీగా గండి.. కారణమదే - వ్యాపార వార్తలు

సౌదీ చమురు ఉత్పత్తి సంస్థ సౌదీ ఆరాంకో లాభాలకు భారీగా గండిపడింది. 2018 లాభాలతో పోల్చితే.. 2019లో 20.6శాతం తగ్గినట్టు పేర్కొంది. ఇందుకు చమురు ధరల క్షీణత ప్రధాన కారణమని స్పష్టం చేసింది. స్టాక్​ మార్కెట్లో నమోదైన తొలి ఏడాదే ఆరాంకో ఈ స్థాయిలో లాభాలకు గండిపడటం గమనార్హం.

SAUDI ARAMCO PROFITS DROP
సౌదీ ఆరాంకో భారీ నష్టం
author img

By

Published : Mar 15, 2020, 5:40 PM IST

Updated : Mar 16, 2020, 12:14 PM IST

ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి సంస్థ సౌదీ ఆరాంకో​కు లాభాలు భారీగా తగ్గాయి. స్టాక్ మార్కెట్లో నమోదైన​ తర్వాత తొలి సారి ఈ సంస్థ వార్షిక ఫలితాలను ప్రకటించింది. 2019కి గాను సంస్థ లాభం 20.6 శాతం తగ్గినట్లు వెల్లడించింది.

గత ఏడాది చివరి నెలలో 29.4 బిలియన్ డాలర్ల విలువైన ఐపీఓతో సౌదీ తడవల్​ మార్కెట్లో లిస్ట్​ అయింది ఈ సంస్థ. ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీఓగా ఇది చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.

ఇవీ లెక్కలు..

2019లో సౌదీ ఆరాంకో​ 88.2 బిలియన్​ డాలర్ల నికర లాభం గడించినట్లు ప్రకటించింది. 2018లో ఈ లాభం 111.1 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు తెలిపింది. ముడిచమురు ధరల పతనం, ఉత్పత్తి తగ్గడం, రిఫైనరీ, రసాయనాల వ్యాపారాల మార్జిన్లలో క్షీణత కారణంగా లాభాలు తగ్గినట్లు పేర్కొంది సౌదీ ఆరాంకో​.

"సౌదీ ఆరాంకో​కు 2019 అసాధారణమైన ఏడాది. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ముందుగా ప్రణాళిక వేసినవి, మరికొన్ని ఊహించనివి. ఎన్ని అవరోధాలు ఎదురైనా.. వెంటనే తిరిగి కోలుకునే శక్తి సంస్థకు ఉందని ప్రపంచానికి తెలిసింది." - ఆమీన్​ నజీర్​ సీఈఓ, సౌదీ ఆరాంకో

కరోనాతో కాదు..

2019లో సంస్థ లాభాలు భారీగా తగ్గడానికి కరోనా వైరస్​, రష్యా-సౌదీ మధ్య కొనసాగుతున్న చమురు యుద్ధం కారణాలు కావని స్పష్టం చేసింది సౌదీ ఆరాంకో​.

2019కి డివిడెండ్​ 73.2 బిలియన్​ డాలర్లు..

2019కి గాను 73.2 బిలియన్​ డాలర్ల డివిడెండ్​ను ఇవ్వనున్నట్లు తెలిపింది సౌదీ ఆరాంకో. ముందుగా చెప్పినట్లుగానే ఈ ఏడాదితో కలిపి వచ్చే ఐదేళ్ల వరకు కనీసం 75 బిలియన్​ డాలర్ల డివిడెండ్​ ఇస్తామని మరో సారి వెల్లడించింది.

మూలధన వ్యయాలు 2019లో 32.3 బిలియన్ డాలర్లకు తగ్గాయి. 2018లో ఇవి 35.1 డాలర్లుగా ఉన్నట్లు సంస్థ తెలిపింది. ఈ ఏడాది మూలధన వ్యయం 25 బిలియన్ డాలర్ల నుంచి 30 బిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తోంది. వచ్చే సంవత్సరానికి సంబంధించిన వ్యయాల అంచనాలు సమీక్ష దశలో ఉన్నట్లు తెలిపింది.

అంతర్జాతీయంగా చమురు ధరలు రికార్డు స్థాయిలో పతనమైన నేపథ్యం సంస్థ షేర్లు ఏకంగా 29 శాతానికి పైగా క్షిణించాయి. దీనితో ప్రస్తుతం సంస్థ మార్కెట్ విలువ 1.55 ట్రిలయన్​ డాలర్లకు తగ్గింది. అయినప్పటికీ ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్​ లిస్టెడ్ కంపెనీగా సౌదీ ఆరాంకో​ కొనసాగుతుండటం విశేషం.

ఇదీ చూడండి:'మొబైళ్లపై జీఎస్టీ పెంపుతో మేక్​ ఇన్ ఇండియాకు ప్రతికూలం'

Last Updated : Mar 16, 2020, 12:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.