ETV Bharat / business

సెయిల్‌ ఛైర్మన్‌ అనిల్​ చౌదరికి కరోనా! - corona in sail

కరోనా మహమ్మారికి పేద, ధనిక అనే తేడా ఏమీ లేదు. సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకు వైరస్​ బారిన పడుతున్నారు. సెయిల్​ ఛైర్మన్​ అనిల్​ కుమార్​ చౌదరికి కొవిడ్​-19 సోకింది. ఆ సంస్థ కార్పొరేట్​ కార్యాలయంలో 25 మందికి కరోనా సోకినట్లు సమాచారం. అయితే.. డైరెక్టర్ మృతి కారణాలపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారాలు నిరాధారమైనవని కంపెనీ వివరణ ఇచ్చింది.

SAIL Chairman
సెయిల్‌ ఛైర్మన్‌ అనిల్​ చౌదరికి కరోనా!
author img

By

Published : Jun 14, 2020, 7:28 AM IST

సెయిల్‌ ఛైర్మన్‌ అనిల్‌ కుమార్‌ చౌదరికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. దీంతో సెయిల్‌ కార్పొరేట్‌ కార్యాలయంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 25కి చేరిందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. 'అనిల్‌ కుమార్‌ చౌదరికి జూన్‌ 1 నుంచి వరుసగా మూడు రోజులు పరీక్షలు నిర్వహించగా.. కొవిడ్‌-19 పాజిటివ్‌ అని తేలింది. ఇప్పుడు ఆయన క్వారంటైన్‌లో ఉన్నార'ని తెలిపాయి.

డైరెక్టర్​ మృతిపై..

సెయిల్‌ డైరెక్టర్‌ (పర్సనల్‌) అతుల్‌ శ్రీవాస్తవ బుధవారం అపోలో ఆసుపత్రిలో మరణించారు. గత కొన్ని రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండటంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని చెప్పడంతో శ్రీవాస్తవను అపోలో ఆసుపత్రిలో చేర్పించామని సెయిల్‌ వెల్లడించింది. ఆయనకు కొవిడ్‌-19 పరీక్ష నిర్వహించగా నెగిటివ్‌ వచ్చిందని తెలిపింది. అయితే.. ఆయన మరణానికి గల కారణాలపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారంతో ఓ లేఖ సర్క్యులేట్‌ అవుతోందని, అందులో పేర్కొన్న వివరాలు నిరాధారమైనవని సెయిల్‌ స్పష్టం చేసింది. అతుల్‌ శ్రీవాస్తవ కుటుంబీకుల్లో మనోధైర్యం నింపేందుకు ప్రయత్నిస్తున్న ఈ తరుణంలో ఇలాంటివి ప్రచారం కావడం దురదృష్టకరమని పేర్కొంది. అతుల్‌ శ్రీవాస్తవ మరణానికి గల కారణాలను కప్పిపుచ్చుకునేందుకు సెయిల్‌ ప్రయత్నిస్తోందని ఆ లేఖలో ఉండటంతో సెయిల్‌ స్పష్టత ఇచ్చింది.

ఇదీ చూడండి: భగవద్గీతతో ప్రశాంతత: గబార్డ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.