ETV Bharat / business

రిలయన్స్, ఫ్యూచర్​ ఒప్పందానికి 6 నెలలు గడువు

ఫ్యూచర్ రిటైల్​తో ఒప్పందం విషయంలో రిలయన్స్ రిటైల్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెజాన్, ఫ్యూచర్​ మధ్య వివాదం నేపథ్యంలో.. ఒప్పందం పూర్తి చేసేందుకు గడువును ఆరు నెలలు పొడిగించింది.

Reliance Retail future retail deal extended
రిలయన్స్​ ఫ్యూచర్​ రిటైల్ ఒప్పందం
author img

By

Published : Apr 2, 2021, 12:46 PM IST

కిశోర్​ బియానీకి చెందిన ఫ్యూచర్​ రిటైల్ కొనుగోలు ఒప్పందం పూర్తి చేసేందుకు ఆరు నెలలు గడువు పొడిగించింది రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్(ఆర్​ఆర్​వీఎల్​). ఈ ఏడాది మార్చి 31తో పూర్తవ్వాల్సిన రూ.24,713 కోట్ల ఒప్పందం గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లు రెగ్యులేటరీకి నివేదించింది.

అమెజాన్, ఫ్యూచర్ రిటైల్ మధ్య వివాదం కొనసాగుతుండటం, ఈ విషయంలో సుప్రీం కోర్టు తీర్పును వాయిదా వేయడం వంటి పరిణామాల నేపథ్యంలో రిలయన్స్ ఈ నిర్ణయం తీసుకుంది.

రిలయల్స్ రిటైల్, ఫ్యూచర్​ రిటైల్ మధ్య 2020 ఆగస్టు 29న ఒప్పందం కుదిరింది. సీసీఐ, సెబీ, స్టాక్ మార్కెట్​ ఎక్స్ఛేంజీలు ఆమోద ముద్ర వేశాయి. ఎన్​సీఎల్​టీ, ఇతర వాటాదారుల నుంచి ఎన్​ఓడీ లభించాల్సి ఉంది.

ఇదీ చదవండి:జట్టుకట్టిన అంబానీ, బియానీ- ఒప్పందం ఖరారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.