ETV Bharat / business

నేడు వర్చువల్​గా రిలయన్స్​ 44వ వార్షిక సమావేశం - business news telugu

రిలయన్స్​ ఇండస్ట్రీస్ నేడు తన 44వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సందర్భంగా 5జీ స్మార్ట్​ఫోన్లకు సంబంధించి కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంపై వాటాదారులతో పాటు ప్రజలలో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

reliance 44th agm, రిలయన్స్​ ఇండస్ట్రీస్​ ఏజీఎం
రిలయన్స్​ సర్వసభ్య సమావేశం
author img

By

Published : Jun 24, 2021, 5:59 AM IST

దేశంలో అత్యంత విలువైన సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్​ నేడు తన 44న వార్షిక సర్వసభ్య సమావేశాన్ని (ఏజీఎం) నిర్వహించనుంది. వర్చవల్​గా జరిగే ఈ సమావేశం మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభం కానుందని సంస్థ ఇదివరకే ప్రకటించింది. కరోనా నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా నిర్వహించాలని నిర్ణయించింది. గతేడాది కూడా ఇదే తరహాలో రిలయన్స్​.. ఏజీఎంను వర్చువల్​గా ​నిర్వహించింది. ​

ఏజీఎంకు ప్రత్యేకత..

రిలయన్స్ ఇండస్ట్రీస్​ ఏజీఎం అంటే వాటాదారులతో పాటు సాధారణ ప్రజలకు కూడా భారీ అంచనాలు ఉంటాయి. రిలయన్స్ జియో వంటి సంచలన నిర్ణయాన్ని ఏజీఎంలోనే ప్రకటించింది కంపెనీ. ఆర్​ఐఎల్.. గత ఏడాది నిర్వహించిన ఏజీఎంను దాదాపు 3 లక్షల మంది వీక్షించారు. ఆ సమావేశం సందర్భంగా జియోలో గూగుల్​ పెట్టుబడులు, గ్లాస్​ పేరిట సరికొత్త సాంకేతికత అభివృద్ధిపై కీలక విషయాలను ఆ సంస్థ అధిపతి ముకేశ్​ అంబానీ వెల్లడించారు.

ఈ ఏడాది ఏజీఎంలో..

44వ ఏజీఎంలో భాగంగా 5జీ సేవల ప్రారంభంపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సేవలు ఈ ఏడాది చివరకు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. 5జీ ఫోన్లకు సంబంధించి కూడా కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో 44వ ఏజీఎంపైన కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇదీ చదవండి : రిలయన్స్ ఇండస్ట్రీ​స్ బోర్డ్​లోకి ఆరాంకో ప్రతినిధి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.