భారత మార్కెట్లో మరో మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది ఒప్పో. ఒప్పో ఎఫ్15 పేరుతో ఈ కొత్త మోడల్‌ను విడుదల చేసింది చైనాకు చెందిన ఈ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ.
8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ సామర్థ్యంతో ఎఫ్15ను అందుబాటులోకి తెచ్చింది ఒప్పో. ఈ మోడల్ ధరను రూ.19,990గా నిర్ణయించింది.
జనవరి 24 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా.. ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ ఎఫ్15 కొనుగోళ్లకు అందుబాటులో ఉండనుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్‌కార్డు ద్వారా చెల్లింపులు చేసే వారికి 10 శాతం వరకు రాయితీ లభించనున్నట్లు ఒప్పో ప్రకటించింది.
ఎఫ్15 కీలక ఫీచర్లు..
- 16.2 సెంటీమీటర్ల ఫుల్ హెచ్డీ, ఆమోలెడ్ డిస్ప్లే
- మీడియాటెక్ హీలియో పీ70 ప్రాసెసర్
- 48 ఎంపీ+8 ఎంపీ+2ఎంపీ+2ఎంపీలతో వెనుకవైపు నాలుగు కెమెరాలు
- 16 మెగా పిక్సెళ్ల సెల్ఫీ కెమెరా
- అండ్రాయిడ్ 9 ఆధారిత కలర్ ఓస్ 6.1.2
- 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ.. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
ఇదీ చూడండి:స్మార్ట్ ఫోన్‌ను కాపాడుకుందాం మరింత ఇస్మార్ట్‌గా