వరుసగా తొమ్మిదో నెలలోనూ ఉత్పత్తిని భారీగా తగ్గించింది ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ. గత కొన్ని నెలలుగా మందగించిన కొనుగోళ్లే ఇందుకు కారణంగా తెలుస్తోంది. 2018 అక్టోబర్‌తో పోలిస్తే.. గతనెల 20.7 శాతం ఉత్పత్తి తగ్గినట్లు మారుతీ సుజుకీ వెల్లడించింది.
2019 అక్టోబర్‌లో మొత్తం 1,19,337 యూనిట్ల ఉత్పత్తి జరిగినట్లు పేర్కొంది. 2018 అక్టోబర్‌లో ఈ సంఖ్య 1,50,497 యూనిట్లుగా ఉంది.
విభాగాల వారీగ ఉత్పత్తి వివరాలు..
విభాగం | 2019 అక్టోబర్ | 2018 అక్టోబర్ |
ప్యాసింజర్ | 1,17,383 యూనిట్లు | 1,48,318 యూనిట్లు |
మిని కాంపాక్ట్ | 85,064 యూనిట్లు | 1,08,462యూనిట్లు |
యుటిలిటీ | 22,526 యూనిట్లు | 22,736 యూనిట్లు |
మిడ్-సెడాన్ | 1,922 యూనిట్లు | 3,513 యూనిట్లు |
సూపర్ క్యారీ | 1,954 యూనిట్లు | 2,179 యూనిట్లు |
ఇదీ చూడండి: 'ఉక్కు' సంకల్పమే.. ఆయన సామ్రాజ్యాన్ని నిర్మించింది