ETV Bharat / business

రివ్యూ 2010-2019: ఈ దశాబ్దంలో ఎన్ని మార్పులో! - పదేళ్లలో వచ్చిన మార్పులు

మనం మారిపోయాం.. తెలుసా..!! అవునండీ మనం మారిపోయాం... చాలా చాలా.. గత పదేళ్లతో పోలిస్తే జీవనం సులభతరమైంది. అంగట్లో సరుకు నుంచి.. దేశ ఆర్థిక పరిస్థితుల వరకు ఎన్నెన్నో మార్పులు వచ్చాయి. వాటిలో కొన్నింటిని ఓ సారి సమీక్షిద్దాం.

ISMART_SRD
ఇస్మార్ట్​ దసాబ్దం
author img

By

Published : Dec 28, 2019, 10:52 AM IST

స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది.. మన ప్రపంచాన్ని చిన్నది చేసేసింది. అమెజాన్‌ ప్రైమ్‌లోనో, నెట్‌ఫ్లిక్స్‌లోనో కొత్త సినిమా చూసేస్తున్నాం. తండూరి చికెన్‌ అయినా.. చింతకాయ పచ్చడైనా.. ఇప్పుడు క్షణాల్లో ఇంటికొచ్చేస్తోంది.. ఇక మింగే మందులైనా.. కట్టుకునే బట్టలైనా.. ఒక్క ఆర్డరిస్తే చాలు.. కళ్లముందు ప్రత్యక్షమవుతున్నాయి.. బంగారం, స్మార్ట్‌ టీవీ.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నో, ఎన్నెన్నో... ఇట్టే వచ్చి వాలిపోతున్నాయి. బయటకెళ్లాలంటే క్యాబ్‌ రెడీ.. జేబులో డబ్బులేకుంటే.. నేనున్నాగా అంటోంది డిజిటల్‌ మనీ. ట్రంకాల్స్‌, ఎస్టీడీల యుగం పోయింది.. ఇప్పుడు.. ఎక్కడికైనా.. ఎంత దూరమైనా.. గంటల తరబడి మాట్లాడేస్తున్నాం.. పెద్దగా ఖర్చుపెట్టక్కర్లేకుండా. ఇప్పటికైనా ఒప్పుకుంటారా.. మనం మారిపోయామని.. ఈ దశాబ్దం మన జీవితాల్నే మార్చేసింది మనకు తెలీనంతగా. ఇంతగా ప్రభావితం చేసిన 2010-2019 దశాబ్దంలో కార్పొరేట్‌ భారతంలో చోటుచేసుకున్న కొన్ని ముఖ్య సంఘటనల సమాహారాన్ని పరిశీలిద్దామా.

ఇంటికే రెస్టారెంట్‌...

ఆహారపు అలవాట్లు ఈ దశాబ్ద కాలంలో బాగా మారాయి. రెస్టారెంట్లకు వెళ్లి తినడం ఒకప్పుడు ఫ్యాషనైతే.. ఇంట్లోనే రెస్టారెంట్‌ ఆహారాన్ని తినడం ఇప్పటి ఫ్యాషన్‌గా మారింది. అందుకు స్విగ్గీ, జొమాటో, ఫుడ్‌ పాండా వంటి యాప్‌లు బాగా ఉపయోగపడ్డాయి. ఆర్డర్‌ ఇచ్చిన గంటలోగా మనం కోరిన రెస్టారెంట్‌ నుంచి ఆహారాన్ని తీసుకుని ఇంటి గుమ్మం ముందుకు తీసుకువస్తున్నారు. దీని వల్ల అటు వినియోగదార్లకు ప్రయోజనం.. ఇటు యువతకు పాకెట్‌మనీ రెండూ వస్తున్నాయి. కొన్ని లక్షల మందికి అదే ఉపాధిగానూ మారింది. నెలకు 5-6 కోట్ల వరకు ఆర్డర్లు వస్తుంటే ఆ మాత్రం ఉపాధి లభించడంలో ఆశ్చర్యం ఏముంది.

FOOD
ఇంటికే రెస్టారెంట్‌​​​​​​​

గ్రోఫర్స్‌ నుంచి అమెజాన్‌ దాకా..

ఇది కూడా ఓ విప్లవంలాంటిదే. ఇంటి దగ్గరి అంగట్లో వెచ్చాలు కొనడం పరిపాటే. అయితే అవి అంతగా నాణ్యత లేకున్నా.. ఎక్కువ దూరం ఏం వెళతాంలే అని వాటితోనే సరిపుచ్చుకునేవాళ్లం. కొన్ని యాప్‌ల రాకతో వినియోగదార్ల కొనుగోలు శైలి పూర్తిగా మారిపోయింది. తక్కువ ధరకే నాణ్యమైన సరుకులను పొందేలా చేస్తున్నాయి. ఇందులో గ్రోఫర్స్‌, అమెజాన్‌, బిగ్‌బాస్కెట్‌ వంటివి ముందున్నాయి. ఒక నివేదిక ప్రకారం.. భారత్‌లో నెలకు 1-2 కోట్ల వరకు ఆర్డర్లు వస్తున్నాయంటే ఇవి ఎంతగా మన ఇంట్లోకి దూరిపోయాయో అర్థం చేసుకోవచ్చు.

ONLINE
గ్రోఫర్స్‌ నుంచి అమెజాన్‌ దాకా..

అతిపెద్ద మార్పు: ఈ-కామర్స్‌

ఈ దశాబ్దపు అతిపెద్ద మార్పుగా ఈ-కామర్స్‌ను చెప్పవచ్చు. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌ల పేర్లు తెలియనివారు ఉండరేమో. ఎందుకంటే గత పదేళ్లలో మొబైల్‌ వంటి వస్తువులను షాపుకు వెళ్లి కొనడం నుంచి ఆన్‌లైన్లో ఆర్డరు చేయడం వరకు ఆ పరిణామ క్రమం మారింది. ఆ విక్రయాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. 2018లో 30 బిలియన్​ డాలర్లకు చేరిన భారత ఈ-కామర్స్‌ మార్కెట్‌ వచ్చే దశాబ్దంలో 100 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందంటే.. ఇది మరెంత మార్పునకు దారి తీస్తుందో చూడాల్సిందే.

ecom
ఈ కామర్స్

కాఫీకి కార్పొరేట్ హంగులు.. చివరకు విషాదం

వినూత్న వ్యాపారం చేయడం సాహసం. ఆ వ్యాపారాన్ని వృద్ధి పథాన నడిపించడం అద్భుతం. ఇంతలా సాహసం.. ఇంతలా అద్భుతం చేసిన కాఫీ డే అధిపతి వి.జి.సిద్ధార్థ జీవితం విషాదాంతం అయ్యింది. కర్ణాటకలోని నేత్రా నదిలో దూకి ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. తొలుత సిద్ధార్థ అదృశ్యమయ్యారనే వార్త వినగానే యావత్‌ కార్పొరేట్‌ భారత్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ తర్వాత బలవన్మరాణానికి పాల్పడ్డారని తెలిసి.. తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఈ సంవత్సరంలోనే కాదు.. ఈ దశాబ్దంలోనే దేశ కార్పొరేట్‌ చరిత్రలో అత్యంత విషాదకర ఘటనల్లో ఇది ఒకటి. దేశీయ కాఫీ బ్రాండును అంతర్జాతీయంగా ప్రాచుర్యం కల్పించడమే కాదు.. ఎంతో మందికి ఉపాధి అవకాశాలు సృష్టించిన సిద్ధార్థ విషాద జీవిత గాథ.. కార్పొరేట్‌ ప్రపంచానికి గుర్తుండిపోయే ఓ అనుభవం పాఠం.

ccd
వి.జి.సిద్ధార్థ

జియో.. ఇదొక ఇంటర్నెట్ విప్లవం

మనింట్లో ఇంటర్నెట్‌ వేగం చాలా తక్కువగా ఉంది నాన్నా అంటూ.. 2011లో ఈశా అంబానీ తన తండ్రి ముకేశ్‌ అంబానీతో ఆ మాటే అనకుంటే.. జియో పుట్టేది కాదేమో. దేశంలో టెలికాం విప్లవానికి నాంది పడేది కాదేమో. 4జీ ఫోన్లు కూడా లేని సమయంలో 4జీ ఎల్‌టీఈ ఫీచర్‌ ఫోన్లు తీసుకురావడం; ఉచిత అపరిమిత కాల్స్‌కు నాంది పలకడం జరిగిపోయింది. వాణిజ్యపరంగా 2016 సెప్టెంబరులో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ కంపెనీ భారత్‌ను డేటా వినియోగంలో నెంబర్‌ 1 స్థానంలో నిలిచేలా చేసింది. వేగంగా వినియోగదార్ల సంఖ్యను పెంచుకోవడంలో రికార్డు సృష్టించింది కూడా. ఇది ప్రారంభం మాత్రమే ఇంకా చేయాల్సింది చాలా ఉందన్న ముకేశ్‌.. ఆప్టికల్‌ ఫైబర్‌నూ తీసుకొస్తున్నారు. అంతే కాదు ఇంట్లో ప్రతి వస్తువును నియంత్రించే ఐఓటీ పరిజ్ఞానాన్ని కూడా అందించనున్నారు.

రగద
జియో

ఈ దశాబ్దపు సంక్షోభం ఇదే

పీఎన్‌బీ సంక్షోభం తర్వాత ఈ దశాబ్దంలో బ్యాంకులను, దేశాన్ని కలవరపరచింది ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభమే. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ కారణంగా ఏర్పడ్డ ఈ సంక్షోభం వల్ల కేవలం ఆ రంగంపై మాత్రమే ప్రభావం పడలేదు. రుణాలు అవసరమైన, తీసుకున్న రంగాలూ ఇబ్బందుల పాలయ్యాయి. అసలు ఎన్‌బీఎఫ్‌సీ నమూనానే బలంగా ఉన్నట్లు కనిపించదు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని.. వాటిని చిన్న, మధ్య స్థాయి కంపెనీలకు ఎక్కువ వడ్డీలకు రుణాలిచ్చే పద్ధతిలో నడిచినన్నాళ్లు నడిచింది. ఒక్కసారి వీటి వద్ద నగదు కొరత రావడంతో అటు.. రుణాలు అవసరమైన కంపెనీలూ కార్యకలాపాలు నిర్వహించలేకపోయాయి. ఇక ఎన్‌బీఎఫ్‌సీలకు రుణాలిచ్చిన బ్యాంకులూ ఇబ్బందుల పాలయ్యాయి. దీంతో ఆ ప్రభావం మొత్తం ఆర్థిక వ్యవస్థపైనా పడింది. ఆరేళ్లలోనే కనిష్ఠ స్థాయికి జీడీపీ వృద్ధి చేరడానికి అది కూడా ఒక కారణంగా నిలిచింది. రాబోయే దశాబ్దంలోనైనా ఈ తరహా సంక్షోభాలు తలెత్తవని భావిద్దాం.

పడిలేచిన కెరటం: మిస్త్రీ

మిస్త్రీని ఒకప్పుడు స్వయంగా రతన్‌ టాటాయే మెచ్చుకుని.. తన వారసుడిగా ప్రకటించారు. గ్రూపును ఉన్నత శిఖరాలకు తీసుకెళతాడని కూడా అన్నారు. అది 2012 నాటి మాట. టాటాయేతర వ్యక్తిగా ఆ టాటా సన్స్‌ ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. కాలం గడిచింది. అదే మిస్త్రీని.. అదే రతన్‌ టాటా ఆ పదవికి పనికిరాడంటూ 2016లో తొలగించారు. ఆ తర్వాత తొలగింపుపై మిస్త్రీ కోర్టుకు వెళ్లారు. మిస్త్రీ తొలగింపునకు చట్టబద్ధత లేదంటూ ఈ ఏడాది చివర్లో కోర్టు తీర్పునిచ్చింది. టాటాలు మళ్లీ కోర్టుకు అప్పీలు చేసుకున్నప్పటికీ..ఒక వేళ మిస్త్రీకే అనుకూలంగా తీర్పు వస్తే.. వచ్చే దశాబ్దంలో టాటా సన్స్‌కు దిశానిర్దేశం చేసేది మిస్త్రీయే అవుతారు. ఏది ఏమైనా ఆ దశాబ్దంలో అందరి నోట్లలో నానిన పేర్లలో మిస్త్రీ కూడా ఒకటి.

mistry
సైరస్​ మిస్త్రీ

ఈ విమానాలు ఎగరడం మానేశాయ్..

ఈ దశ వత్సరాల్లో రెండు విమానయాన సంస్థలు రన్‌వే నుంచి పక్కకు వచ్చేశాయి. కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేశాయి. ఒకటి కింగ్‌ఫిషర్‌ఎయిర్‌లైన్స్‌ కాగా.. మరొకటి జెట్‌ ఎయిర్‌వేస్‌. 2012లో మాల్యా ఆధ్వర్యంలోని కింగ్‌ఫిషర్‌ నేలకు దిగగా.. ఈ ఏడాది ఏప్రిల్‌లో జెట్‌ రెక్కలు విరిగిపోయాయని చెప్పాలి. మాల్యా దేశాలు వదిలిపెట్టి పారిపోగా.. ఆయన్ను వెనక్కి రప్పించడం అనేది వచ్చే దశాబ్దంలోనైనా జరుగుతుందో లేదో చూడాలి. ఇక జెట్‌ ఎయిర్‌వేస్‌కు అప్పుల కష్టాలు ఎక్కువై నడపలేని పరిస్థితికి వచ్చింది. కర్ణుడి చావుకు ఎన్నో కారణాలన్నట్లు.. ఈ రెండు విమానయాన సంస్థల కార్యకలాపాలు నిలిచిపోవడానికీ అన్నే కారణాలు.

jet
కింగ్​ ఫిషర్​ ఎయిర్​లైన్స్​, జెట్​ ఎయిర్​వేస్​

నగదుతో పనేంటి..

డిజిటల్‌ విప్లవం.. ఈ దశాబ్దం అందించిన ఓ అద్భుత కానుక. సాంకేతికతపరంగా గతంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నా.. డిజిటల్‌ చెల్లింపులు మానవ జీవన విధానాన్నే ఓ కొత్త దిశ వైపు అడుగులు వేయిస్తున్నాయి. డిజిటల్‌ లావాదేవీలకు పెద్ద నోట్ల రద్దు బీజం వెయ్యగా.. స్మార్ట్‌ఫోన్లు, రిలయన్స్‌ జియో చౌక డేటా పథకాలతో ఇవి మారుమూల గ్రామాలకూ పరిచయమయ్యాయి. దేశంలో డిజిటల్‌ లావాదేవీల వృద్ధిలో ముఖ్య భూమిక.. బీమ్‌ యూపీఐ యాప్‌దే. ఇప్పుడు చాలా దుకాణాల్లో పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ యంత్రాలు (పీఓఎస్‌) లేదంటే చెల్లింపు యాప్‌ల క్యూఆర్‌ కోడ్‌లు దర్శనమిస్తున్నాయి. పెద్దపెద్ద నగరాల్లోనే కాదు.. చిన్న పట్టణాల్లోనూ కనీసం రూ.10 చెల్లించేందుకే యాప్‌లు వాడుతున్నారంటే.. దేశంలో డిజిటల్‌ విప్లవం ఇప్పటికే ఎంతలా విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు.

digi
డిజిటల్ లావాదేవీలు

ఇంట్లో కూర్చునే అన్నీ..

ఓవర్‌ ద టాప్‌(ఓటీటీ) కంటెంట్‌ అందించే కంపెనీలకు ఒక విధంగా డిమాండ్‌ పెరిగింది జియో వల్లే. 4జీ వేగం, రోజుకు 1.5 జీబీ డేటా ఉండడం; ఎక్కడ కావాలంటే అక్కడ చూసుకునే వెసలుబాటు ఉండడం; ప్రయాణాల్లో మంచి ఆటవిడుపు కావడం వంటి కారణాల వల్ల అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌, ఈరోస్‌ నౌ, వూట్‌, హాట్‌స్టార్‌ వంటి వాటికి వినియోగదార్లు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. భవిష్యత్‌లో వెండితెరకు ఇవి పోటీ కూడా కావొచ్చు. ఆ లెక్కన ఈ దశాబ్దంలోనే కాదు.. వచ్చే దశాబ్దంలోనూ జియోదే హవా కానుంది.

ott
ఓటీటీ

కొరకరాని కొయ్య..

జీఎస్‌టీ.. ఈ దశాబ్దంలోనే కాదు దేశానికి స్వాతంత్య్రం వచ్చాక చేపట్టిన అతిపెద్ద పన్నుల సంస్కరణ. 2017లో అమల్లోకి వచ్చిన ఈ కొత్త పరోక్ష పన్నుల విధానాన్ని ఇప్పటికీ బాలారిష్టాలు వెంటాడుతున్నాయి. సంక్లిష్ట నిబంధనలు.. బహు రిటర్న్‌లు వెరసి జీఎస్‌టీ చట్టం వ్యాపారులకు ఓ కొరకరాని కొయ్యగా తయారయ్యింది. జీఎస్‌టీ అమలు అనంతరం ఏర్పడిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఏదో రూపంలో మరిన్ని కొత్త సమస్యలు పుట్టుకొస్తూనే ఉన్నాయి.

జంప్​ జిలానీలు..

విలాస పురుషుడు మాల్యా బ్యాంకులకు రూ.వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి చడీచప్పుడు చేయకుండా విదేశాలకు పారిపోయాడు.. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ చరిత్రలో అత్యంత భారీ కుంభకోణానికి కారణమైన వజ్రాల వ్యాపారులు నీరవ్‌ మోదీ, మెహుల్‌ ఛోక్సీలు కూడా మాల్యా మార్గానే ఎంచుకున్నారు. మాల్యా భారత్‌ను విడిచిపెట్టి మూడేళ్లవ్వగా.. నీరవ్‌మోదీ, మెహుల్‌ ఛోక్సీలు 2018లో పారిపోయారు. ఈ ముగ్గుర్నీ భారత్‌కు రప్పించేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఆ ప్రయత్నాలు ఇప్పటికైతే ఫలించలేదు.

eco
విజయ్​ మాల్యా, నీరవ్​ మోదీ, మోహుల్ ఛోక్సీ

మా లచ్చిమి దేవీ...

చమురు ధరల పతనం.. గ్రీస్‌ సంక్షోభం.. బ్రెగ్జిట్‌.. అమెరికా- చైనా వాణిజ్య యుద్ధం.. పెద్ద నోట్ల రద్దు.. రూపాయి క్షీణత.. ఇలా ఒక్కటేంటి ఎన్నో మరెన్నో దేశీయ, అంతర్జాతీయ ప్రతికూలతలు చుట్టుముట్టాయి. మధ్యమధ్యలో ఉత్థాన పతనాలు సంభవించాయి. అయితేనేం స్టాక్‌ మార్కెట్‌ మదుపర్లకు సిరులు కురిపించింది. ఈ దశాబ్దంలో కనీవినీ ఎరుగని రీతిలో అసలు సిసలు సత్తాను చాటింది. రికార్డులే శ్వాసగా సాగిపోయింది. సెన్సెక్స్‌ దూకుడుకు 25,000... 30,000.. 35,000.. 40,000.. ఇలా ఒక్కో మైలురాయి కరిగిపోయింది. నిఫ్టీ ఎప్పటికప్పుడు కొత్త శిఖరాలను అధిరోహిస్తూ 12000 స్థాయిని అందుకుంది. మదుపర్లతో భళా అనిపించుకుంది. 2011లో 20500 నుంచి ప్రారంభమైన సెన్సెక్స్‌ ప్రయాణం.. 2019 ముగిసేనాటికి రెట్టింపై 41575 పాయింట్లకు చేరింది. నిఫ్టీ పరుగు 6100 నుంచి మొదలై 12246ను అందుకుంది. పెద్ద కంపెనీల షేర్లే కాదు.. మధ్య, చిన్న తరహా షేర్లలో కొన్ని తళుక్కుమని మెరిశాయి కూడా. అయితే ఆర్థిక మందగమనమో లేదంటే మరో కారణమో గానీ గత రెండేళ్లుగా ఈ తరహా షేర్లు మదుపర్లకు నష్టాన్ని మిగిల్చాయి. ఇదొక్కటే ఈ దశాబ్దంలో స్టాక్‌ మార్కెట్‌పరంగా ఆందోళన కలిగించిన విషయం.

market
మా లచ్చిమి దేవీ

అతి 'పెద్ద' పరిణామం

నవంబరు 8, 2016.. ఆ రోజు దేశంలో ఆశ్చర్యపోని వ్యక్తి అంటూ ఉండడేమో. ప్రధాని నరేంద్ర మోదీ రూ.500; రూ.1000 నోట్లను రద్దు చేయడంతో పాటు కొత్తగా రూ.2000 నోటును తక్షణం అమలు చేశారు. అంతే కాదు పాత కరెన్సీ నోట్లను డిపాజిట్‌ చేయడానికి డిసెంబరు 30 తేదీని గడువుగా పెట్టారు. చెలామణీలో ఉన్న 86 శాతం నగదును ఒక విధంగా రద్దుచేయడంతో జనాల చేతిలో డబ్బులేకుండా అయిపోయింది. దేశంలో ఎక్కడ చూసినా.. ఏటీఎమ్‌ల ముందు భారీ క్యూలైన్లు కనిపించాయి. అప్పుడే పేటీఎమ్‌, రుపే, మొబిక్విక్‌ వంటి వాలెట్ల ఉపయోగం పెరిగింది. పరిస్థితులన్నీ చక్కబడడానికి సమయం పట్టింది. నల్లధనాన్ని వెలికితీద్దామన్న ప్రధాన లక్ష్యంతో ఈ పని చేసినా.. వ్యవస్థలోకి 95 శాతానికి పైగా డబ్బు తిరిగి చేరడం గమనార్హం. ఏది ఏమైనా.. గత దశాబ్ద కాలంలో తీసుకున్న అతిపెద్ద నిర్ణయంగా అది నిలిచిపోయింది.

note
పెద్ద నోట్ల రద్దు

ఇదీ చూడండి:ప్రివ్యూ 2020: మరింత ప్రియం కానున్న కూరగాయలు!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:  
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
New York - 27 December 2019
1. Tilt up from techs to New Year's Eve ball
2. Wide pan of Times Square
3. Wide of people walking on street
4. Close of '2020' sign for New Year's Eve celebration
5. SOUNDBITE (English) Tim Tompkins, Times Square Alliance President and Co-Producer of New Year's Eve:
"Years ago, there was really no entertainment at all, you just -- for one minute you watched the ball go down. But it's really grown. Pretty much every network in the world in some way or another is represented here because it's one of the few times, really, where the world comes together. And that's why we want to take advantage of this moment of the world coming together to say, 'Let's look at what's been going on the last year. What do we want to say goodbye to or get rid of? And who do we want to celebrate?' We want to celebrate science and science teachers in a time when we need them and their students to solve some of the problems that we older folks have created for the world."
6. Various of techs adding new crystals to the Times Square New Year's Eve ball
7. SOUNDBITE (English) Tom Brennan, Master artisan and ambassador for Waterford Crystals:  
"Remember, there's 2,688 crystal triangles -- Waterford triangles -- up there this morning. And we're going to be replacing that with 192 of this one right here. This is this year's theme: The Gift of Goodwill. As you can see on this here, you can see these intertwining pineapples. The pineapple; effectively, has been the symbol of generosity, of goodwill, if you will, for generations, for centuries. And that's why it is very special to be here this morning."
8. Pan from triangle crystals to a model of the cyrstal ball
9. Wide of President of the Times Square Alliance Tim Tompkins, Waterford Crystals master artisan Tom Brennan and Countdown Entertainment President Jeffrey Straus posing with crystals and ball
10. Close of Times Square New Year's Eve ball changing colors
11. Various of Tompkins, Brennan and Straus posing for pictures with new crystal
12. SOUNDBITE (English) Tim Tompkins, Times Square Alliance President and Co-Producer of New Year's Eve:
"This last year, a predominant theme in the media and the news was, of course, climate change -- it was impossible to avoid it. And so, when we were thinking about how do we turn that challenging situation into something sort of hopeful as we look forward, we decided that our special guests this year would to honor science teachers and their students."
13. Close of Times Square New Year's Eve ball changing colors
14. Close of New Year's Eve ball, glowing in red and fading to green color
15. Time Square Alliance officials posing with model of crystal ball
STORYLINE:
Preparations for New Year's Eve in Times Square in New York are taking shape, and some of those shapes are 192 new crystal triangles on the famous ball.
Some new crystals are swapped in every year.
This year's additions feature a pineapple design in keeping with this year's "gift of goodwill" theme.
The pineapple is a "symbol of generosity, of goodwill," said master artisan and Waterford Crystals ambassador Tom Brennan.
The ball measures 12 feet in diameter and weighs almost 12,000 pounds. It's positioned atop One Times Square.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.