ETV Bharat / business

ఆటో ఎక్స్​పోలో మహీంద్రా విద్యుత్​ కార్ల జోరు - mahindra e kuve price

దిల్లీలో జరుగుతున్న ఆటో ఎక్స్​పో 2020లో దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా రెండు విద్యుత్ కార్లను ఆవిష్కరించింది. ఈకేయూవీ100 పేరుతో విడుదల చేసిన ఓ మోడల్ ధరను రూ.8.25 లక్షలుగా నిర్ణయించింది. లగ్జరీ లుక్​తో ఫన్‌స్టర్‌ ఎలక్ట్రిక్‌గా మరో ఎస్‌యూవీనీ విడుదల చేసింది మహీంద్రా.

Mahindra launches eKUV100
మహీంద్రా ఈకేయూవీ 100
author img

By

Published : Feb 5, 2020, 8:38 PM IST

Updated : Feb 29, 2020, 7:44 AM IST

దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా&మహీంద్రా విద్యుత్‌తో నడిచే ఈకేయూవీ100 కారును మార్కెట్లోకి విడుదల చేసింది. దిల్లీలో జరుగుతున్న ఆటో ఎక్స్‌పో-2020లో మహీంద్రా ఈ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈకేయూవీ 100 ప్రారంభ ధరను రూ.8.25 లక్షలుగా సంస్థ నిర్ణయించింది. ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న విద్యుత్‌ కార్లతో పోలిస్తే ఈ కారు సరసమైన ధరకు లభించనుంది. చూడటానికి పెట్రోల్ ఇంజిన్‌తో నడిచే సంప్రదాయ కేయూవీ 100 వాహనాన్ని పోలి ఉన్నప్పటికీ.. ఈ ఎలక్ట్రిక్‌ కారులో పలు కీలక మార్పులు చేసినట్లు మహీంద్రా తెలిపింది. హెడ్‌ల్యాంప్‌, గ్రిల్, వెనక లైట్లుతో పాటు కారు ఇంటీరియర్‌లోనూ మార్పులు చేశారు. టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్, కనెక్టెడ్ కార్‌ టెక్నాలజీ, లోకేషన్‌ ట్రాకింగ్ వంటి ఆధునిక సదుపాయాలు ఇందులో ఉన్నాయి.

మహీంద్రా ఈకేయూవీ100లో 40కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటారును అమర్చారు. ఇది 53బీహెచ్‌పీ శక్తిని, 120ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని సింగిల్ స్పీడ్ ట్రాన్స్‌మిషన్ కారు ముందు చక్రాలకు శక్తిని అందిస్తుంది. అలానే ఈకేయూవీ 100లో 15.9 కిలోవాట్ లిథియం అయాన్‌ బ్యాటరీని అమర్చారు. ఇది ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 120 కిలోమీటర్లు పైగా ప్రయాణిస్తుందని సంస్థ తెలిపింది.

కేవలం 60 నిమిషాల్లో 0-80 శాతం ఛార్జింగ్ అవుతుంది. పూర్తి స్థాయిలో ఛార్జింగ్ అయ్యేందుకు 5 గంటల సమయం పడుతుంది.

కేయూవీ శ్రేణిలో మరో విద్యుత్​ ఎస్​యూవీ..

mahindra
మహీంద్రా ఫన్‌స్టర్‌ ఎలక్ట్రిక్‌

ఆటోఎక్స్‌పో వేదికగా మహీంద్రా ఎస్‌యూవీ శ్రేణిలో మరో ఎలక్ట్రిక్‌ వాహనాన్ని ప్రదర్శించింది. ఫన్‌స్టర్‌ ఎలక్ట్రిక్‌గా పిలిచే ఈ ఓపెన్‌ టాప్ కారు ఎక్స్‌యూవీ 500ను పోలి ఉంటుంది. ఎల్ ఆకారంలో హెడ్‌ల్యాంప్స్‌, ఫాగ్ ల్యాంప్స్, ఎల్‌ఈడీ లైట్లను కారు ముందు భాగంలో అమర్చారు. ఇందులో 60 కిలోవాట్ బ్యాటరీతో పాటు నాలుగు ఎలక్ట్రిక్‌ మోటార్లను నాలుగు చక్రాలకు అనుసంధానించారు.

ఈ నాలుగు మోటార్లు 312 బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తూ 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 5 సెకండ్లలో అందుకుంటుందని మహీంద్రా తెలిపింది. ఫన్‌స్టర్‌ ఎలక్ట్రిక్‌ 5 సీట్లు, 7 సీట్లు వేరియంట్లలో అందుబాటులోకి తేనున్నారు.

ఇదీ చూడండి:ఆటోఎక్స్‌పో 2020: కొత్త కార్ల తళుకుబెళుకులు ఇవిగో!

Intro:अयोध्या में राम मंदिर निर्माण के साथ ही केंद्र सरकार ने सुप्रीम कोर्ट के फैसले के मुताबिक सुन्नी वक्फ बोर्ड के लिए मस्जिद बनाने के लिए जमीन तय कर दी है. यह जमीन अयोध्या जिला मुख्यालय से करीब 17 किलोमीटर की दूरी पर है. जमीन बेहद पोटेंशियल क्षेत्र में है. सुन्नी वक्फ बोर्ड की जमीन नेशनल हाईवे संख्या 28 से जुड़ी हुई है.

सुनी वह गुड़ के लिए मसीह के लिए दी जाने वाली जमीन अयोध्या के धनी पुर ग्राम सभा की जमीन है. यह एक सरकारी फॉर्म हाउस की जमीन है. जिसका क्षेत्रफल करीब 10 एकड़ का है. कृषि विभाग इस पर खेती का काम कराता है.
धनीपुर ग्राम सभा में कुल आबादी का लगभग 50 प्रतिशत मुस्लिम लोग रहते हैं.

Body:लकी राजस्व विभाग के अधिकारी अभी सरकारी निर्देश नानी के चलते कुछ कहने से बच रहे हैं. फिलहाल सूत्रों की माने तो अयोध्या के धनी पुर ग्राम सभा की जमीन सुन्नी वक्फ बोर्ड को दिया जाना लगभग तय है.

Conclusion:ईटीवी भारत ने सबसे पहले अपने कमरे पर सुन्नी वक्फ बोर्ड को दी जाने वाली जमीन की तस्वीरें कैद की है. धन्नीपुर ग्राम सभा के ग्राम प्रधान राकेश कुमार यादव का कहना है कि सुन्नी वक्फ बोर्ड को मस्जिद के लिए हा जमीन मिलने से गांव का विकास होगा. यहां धार्मिक स्थल बनने से लोगों को रोजगार के भी अवसर उपलब्ध होंगे.

बाइट राकेश कुमार यादव ग्राम प्रधान धन्नीपुर ग्राम सभा अयोध्या
Last Updated : Feb 29, 2020, 7:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.