ETV Bharat / business

కోటక్ బ్యాంక్, టాటా పవర్ దూకుడుకు కారణమిదే...

స్టాక్ మార్కెట్​లో కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా పవర్ షేర్లు మంగళవారం సెషన్​లో భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. కోటక్​ బ్యాంక్ షేర్లు దాదాపు 8 శాతం పుంజుకోగా.. టాటా పవర్ షేర్లు దాదాపు 7 శాతం వృద్ధిని సాధించాయి.

Kotak bank shares rise high
భారీ లాభాల్లో కోటక్ బ్యాంక్
author img

By

Published : Jun 2, 2020, 1:22 PM IST

ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్ స్టాక్ మార్కెట్లో భారీ లాభాల్లో ట్రేడవుతోంది.

ఆర్​బీఐ నిబంధనల మేరకు కోటక్ బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్​ కోటక్ తన వ్యక్తిగత వాటాను 26 శాతానికి పరిమితం చేసుకునేందుకు అదనంగా ఉన్న 2.83 శాతం వాటాను రూ.6,800 కోట్లకు మంగళవారం విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోటక్​ బ్యాంక్ షేర్లు దాదాపు 8 లాభంతో ట్రేడవుతున్నాయి.

  • బీఎస్​ఈలో కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.88 శాతం వృద్ధి చెందింది. షేరు విలువ రూ.1,347.75కి చేరింది.
  • ఎన్​ఎస్​ఈలో 7.97 శాతం పుంజుకున్న కోటక్ బ్యాంక్ షేరు విలువ రూ.1,348 వద్ద ఉంది.

టాటా పవర్​ జోరు..

టాటా గ్రూప్​కు చెందిన టాటా పవర్​ కూడా మంగళవారం సెషన్​లో భారీగా పుంజుకుంది.

టీపీ సెంట్రల్ ఒడిశాలో డిస్ట్రిబ్యూషన్​లో లిమిటెడ్​లో 51 శాతం వాటా సొంతం చేసుకునే ప్రక్రియ పూర్తయినట్లు టాటా పవర్ ప్రకటించడం ఇందుకు ప్రధాన కారణం.

  • బీఎస్​ఈలో టాటా పవర్ 6.82 శాతం వృద్ధి చెందింది. షేరు విలువ రూ.42.25గా ఉంది.
  • ఎన్​ఎస్​ఈలో 6.97 శాతం పెరిగిన టాటా పవర్​ షేరు విలువ రూ.42.20కి చేరింది.

ఇదీ చూడండి:'సమాజంలో ద్వేషం, జాత్యహంకారానికి చోటు లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.