బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో వైద్యులు, నర్సులకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. కరోనా వైరస్‌పై పోరులో ముందున్న డాక్టర్లు, నర్సులు తమ విమానాల్లో ప్రయాణిస్తే 25 శాతం రాయితీ ఇస్తున్నట్లు వెల్లడించింది.
కంపెనీ అధికారిక వెబ్సైట్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్లో టికెట్ బుక్ చేసుకున్న వైద్యులు, నర్సులు.. చెక్ ఇన్ సమయంలో వారు పని చేసే ఆస్పత్రి ఐడీ కార్డును చూపించాల్సి ఉంటుందని ఇండిగో స్పష్టం చేసింది.
జులై 1న ప్రారంభమైన ఈ ఆఫర్ ఈ ఏడాది చివరి వరకు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది ఇండిగో.
-
Doctors and nurses everywhere, we’ve got you a sweet #toughcookie discount - up to 25%* off when you book through our website. *T&Cs apply. Click to know more https://t.co/iXL73zH1Lb #LetsIndiGo #NationalDoctorsDay pic.twitter.com/xs6mx5MyzM
— IndiGo (@IndiGo6E) July 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Doctors and nurses everywhere, we’ve got you a sweet #toughcookie discount - up to 25%* off when you book through our website. *T&Cs apply. Click to know more https://t.co/iXL73zH1Lb #LetsIndiGo #NationalDoctorsDay pic.twitter.com/xs6mx5MyzM
— IndiGo (@IndiGo6E) July 1, 2020Doctors and nurses everywhere, we’ve got you a sweet #toughcookie discount - up to 25%* off when you book through our website. *T&Cs apply. Click to know more https://t.co/iXL73zH1Lb #LetsIndiGo #NationalDoctorsDay pic.twitter.com/xs6mx5MyzM
— IndiGo (@IndiGo6E) July 1, 2020
ప్రత్యేక గుర్తింపు..
ఈ ఆఫర్‌తో పాటు తమ విమానాల్లో ప్రయాణించే డాక్టర్లు, నర్సుల ప్రయాణానికి మరింత ప్రత్యేకత కల్పించనున్నట్లు తెలిపింది ఇండిగో. ఇందుకోసం చెక్ఇన్ అయిన వెంటనే వారికి బిస్కెట్ల డబ్బాను కాంప్లిమెంటరీ కింద ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఆ తర్వత వారికి బోర్డింగ్ గేట్ల వద్ద ప్రత్యేకంగా స్వాగతం పలకనున్నట్లు వెల్లడించింది. ప్రయాణమంతా ప్రత్యేక గుర్తింపు కోసం.. విమానం బయలుదేరడానికి ముందు ఇచ్చే పీపీఈ కిట్లపై కుకీస్ స్టిక్కర్ అతికించనున్నట్లు వివరించింది.
ఇదీ చూడండి:నిషేధంతో టిక్‌టాక్‌కు రూ.45 వేల కోట్ల నష్టం!