ETV Bharat / business

జనవరి 31లోపు అందరికీ రీఫండ్: ఇండిగో - ఇండిగో రిఫండ్

బడ్జెట్​ విమానయాన సంస్థ ఇండిగో.. లాక్​డౌన్​ కారణంగా రద్దయిన విమానాలకు టికెట్ బుక్​ చేసుకున్న వినియోగదారులకు రీఫండ్ చెల్లిస్తున్నట్లు ప్రకటించింది. జనవరి చివరి నాటికి అందరికీ సొమ్ము తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేసింది.

INDIGO REFUND
ఇండిగో ప్రయాణికులకు రిఫండ్
author img

By

Published : Dec 7, 2020, 1:51 PM IST

కరోనా నేపథ్యంలో విధించిన లాక్​డౌన్ కారణంగా రద్దయిన విమానాలకు టికెట్​ బుక్​ చేసుకున్న ప్రయాణికులందరికీ రీఫండ్ చేస్తున్నట్లు బడ్జెట్ విమానాయాన సంస్థ ఇండిగో ప్రకటించింది. వారందరికీ 2021 జనవరి 31లోపు సొమ్ము చెల్లిస్తామని వెల్లడించింది.

ఇప్పటికే రూ.1,000 కోట్లను ప్రాసెస్ చేసినట్లు ఇండిగో పేర్కొంది. ఈ మొత్తం తమ వినియోగదారులకు చెల్లించాల్సిన రీఫండ్​లో 90 శాతానికి సమానమని చెప్పింది.

కరోనా కారణంగా ఒక్కసారిగా లాక్​డౌన్ విధించడం వల్ల ఆదాయం పడిపోయిందని ఇండిగో తెలిపింది. ఈ కారణంగానే వెంటనే రీఫండ్ చేయలేకపోయామని వివరించింది. దేశీయంగా విమాన ప్రయాణాలు కొనసాగుతున్న కారణంగా ఇప్పుడిప్పుడే ఆదాయం పెరుగుతోందని తెలిపింది.

ఇదీ చూడండి:'వ్యాక్సిన్ వ్యయాలపై 200% పన్ను డిడక్షన్​!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.