ETV Bharat / business

కెయిర్న్​ వివాదంలో అమెరికా కోర్టుకు భారత్​ - కెయిర్న్​తో పన్ను వివాదం ఎందుకు

కెయిర్న్​తో ఏర్పడిన పన్ను వివాదంలో భారత ప్రభుత్వం వాషింగ్టన్​ ఫెడరల్​ కోర్టును ఆశ్రయించింది. కెయిర్న్​కు 1.2 బిలియన్​ డాలర్లు చెల్లించాలన్న ఆర్బిట్రేషన్​ కోర్టు ఆదేశాలను కొట్టివేయాలని​ పిటిషన్​ దాఖలు చేసింది.

Cairn issue with Indian Govt
కెయిర్న్​తో భారత్​ వివాదం
author img

By

Published : Aug 17, 2021, 7:19 PM IST

బ్రిటన్‌ సంస్థ కెయిర్న్‌ ఎనర్జీకి రూ.1.2 బిలియన్ డాలర్లు చెల్లించాలన్న అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం ఆదేశాలను కొట్టివేయాలని.. భారత ప్రభుత్వం వాషింగ్టన్​ కోర్టును అభ్యర్థించింది. అమెరికా చట్టాల ప్రకారం.. ఈ విషయంలో సార్వభౌమ నిర్ణయాధికారాలు కోర్టుకు ఉన్నాయని తెలిపింది.

గత ఏడాది డిసెంబర్​లో కెయిర్న్​కు భారత్​ రూ.1.26 బిలియన్ డాలర్లు చెల్లించాలని ఆర్బిట్రేషన్ కోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. ఆ మొత్తాన్ని చెల్లించేలా ఎయిర్​ఇండియాపై ఒత్తిడి తేవాలని 2021 మేలో కెయిర్న్​ సంస్థ అమెరికా ఫెడరల్​ కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 13న.. ప్రభుత్వం అమెరికా జిల్లా కోర్టు (కొలంబియా)లో 'మోషన్​ టూ డిస్​మిస్'​ పిటిషన్​ను దాఖలు చేసింది. కెయిర్న్​, భారత ట్యాక్స్ అథారిటీ మధ్య అధికారిక పరిధి లేదని అందులో పేర్కొంది.

కెయిర్న్​కు సానుకూలంగా మారిన ఆ అంశం..

భారత్​.. 2012 నాటి రెట్రోస్పెక్టివ్‌ పన్ను చట్టాన్ని వినియోగించి వొడాఫోన్‌ సహా 17 సంస్థలపై మొత్తం రూ.1.10 లక్షల కోట్ల పన్ను విధించినా, కెయిర్న్‌ కేసులో మాత్రమే అధికంగా వసూలు చేశారు. ఆ సంస్థ నుంచి రూ.10,247 కోట్ల పన్ను బకాయిలు రాబట్టుకునేందుకు కెయిర్న్‌ భారత అనుబంధ సంస్థలో 10 శాతం వాటా విక్రయించడం, రూ.1,140 కోట్ల డివిడెండు జప్తు చేయడం, రూ.1,590 కోట్ల పన్ను రిఫండ్‌లను నిలిపివేయడం వంటి చర్యలను ఆదాయపు పన్ను సంస్థ చేపట్టింది. 2015 మార్చిలో పన్ను నోటీసు ఇచ్చిన రెండేళ్లలోనే ఎక్కువ శాతం షేర్లను విక్రయించినట్లు ఒక అగ్రగామి పన్ను నిపుణుడు వెల్లడించారు. అటాచ్‌ చేసిన షేర్లను కెయిర్న్‌ విక్రయించలేదన్న విషయాన్ని మరిచారని, ఇది కెయిర్న్‌కు న్యాయప్రక్రియల్లో బలం చేకూర్చిందని పన్ను నిపుణులు పేర్కొంటున్నారు.

ఇదీ చదవండి: కెయిర్న్​ వివాదంలో భారత్​కు ఎదురుదెబ్బ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.