ETV Bharat / business

ప్రధాన నగరాల్లో గృహ విక్రయాలు అంతంతమాత్రమే! - రియల్టీ న్యూస్

దేశ వ్యాప్తంగా తొమ్మిది ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు భారీగా తగ్గినట్లు తెలుస్తోంది. ఓ సర్వే ప్రకారం ఈ తొమ్మిది నగరాల్లో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 64,034 యూనిట్లు మాత్రమే విక్రయమయ్యాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంతో ఇదే సమయంతో పోలిస్తే.. ఈ అమ్మకాలు 30 శాతం తక్కువ.

HOUSING
ప్రధాన నగరాల్లో గృహ విక్రయాలు అంతంతమాత్రమే!
author img

By

Published : Jan 15, 2020, 8:01 AM IST

ఆర్థిక మందగమనం కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో గృహ విక్రయాలు భారీగా క్షీణించినట్లు తెలుస్తోంది. రియల్టీ కన్సల్టేషన్​ సంస్థ 'ప్రాప్​ టైగర్' విడుదల చేసిన నివేదిక ప్రకారం.. దేశంలోని 9 ప్రధాన నగరాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు 30 శాతం క్షీణించాయి. ఈ సమయంలో 64,034 యూనిట్లు మాత్రమే విక్రయమయ్యాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (2018-19) ఇదే సమయంలో 91,464 యూనిట్లు అమ్ముడవడం గమనార్హం.

గడిచిన మూడు త్రైమాసికాల్లోనూ అదే తీరు..

2019-20 తొలి తొమ్మిది నెలల్లో చూస్తే... రెసిడెన్షియల్ ప్రాపర్టీ మార్కెట్​ 13 శాతం తగ్గినట్లు తేలింది.
హైదరాబాద్​, బెంగళూరు, చెన్నై, గురుగ్రామ్, కోల్​కతా, ముంబయి, పుణె, నోయిడా, అహ్మదాబాద్​లలో చేసిన సర్వే ఆధారంగా ఈ నివేదిక విడుదల చేసింది 'ప్రాప్ టైగర్'​​.

నగరాల వారీగా..

నగరాల వారీగా చూస్తే డిసెంబర్​తో ముగిసిన త్రైమాసికానికి బెంగళూరులో అత్యధికంగా 50 శాతం వరకు ఇళ్ల విక్రయాలు తగ్గాయి. మొత్తం 5,155 యూనిట్లు మాత్రమే విక్రయమయ్యాయి.

నగరం క్యూ3లో తగ్గుదల శాతం క్యూ3లో అమ్ముడైన యూనిట్లు
హైదరాబాద్ 44 4,372
పుణె 39 11,946
నోయిడా 38 2,830
చెన్నై 33 3,015
కోల్​కతా 33 2,566
ముంబయి 18 25,198
అహ్మదాబాద్ 14 5,118
గురుగ్రామ్​ 6 3,834

ఇదీ చూడండి:రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ మార్కెట్లోకి బజాజ్ చేతక్

New Delhi, Jan 14 (ANI): Supreme Court dismissed curative petitions of two convicts - Vinay Kumar Sharma and Mukesh Singh in 2012 Nirbhaya gang rape case on January 14. Convicts moved to SC after a Delhi court issued death warrant of all four convicts. Convicts are slated for execution on January 22, 7 AM. They were convicted for heinous rape of a 23-year-old medical professional on a moving bus on the night of December 16, 2012. The victim later succumbed to her injuries.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.