ETV Bharat / business

'మనుషుల మాదిరి ఆలోచించే యంత్రాలకే డిమాండ్' - వాణిజ్య వార్తలు

కృత్రిమ మేధ విప్లవం అన్ని రంగాలను చుట్టేసే రోజు ఎంతో దూరంలో లేదని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ కార్పొరేట్‌ వైస్‌-ప్రెసిడెంట్‌, ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ శ్రీమతి శివశంకర్‌ తెలిపారు. అనూహ్య మార్పులకు ఏఐ- మెషీన్‌ టెర్నింగ్‌ శ్రీకారం చుట్టబోతున్నాయన్నారు. కొవిడ్‌-19 వల్ల ఈ మార్పు ఇంకా వేగవంతమైందని అన్నారు.

HCL DIR
శివశంకర్
author img

By

Published : Oct 23, 2020, 10:01 AM IST

మనుషుల మాదిరిగానే ఆలోచించి, స్పందించే యంత్రాలు, అందుకు వీలుకల్పించే టెక్నాలజీలకు సమీప భవిష్యత్తులో ఎంతో గిరాకీ ఉంటుందని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ కార్పొరేట్‌ వైస్‌-ప్రెసిడెంట్‌, ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ శ్రీమతి శివశంకర్‌ అన్నారు. ఈ మార్పులకు హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ సన్నద్ధంగా ఉందని, సిబ్బందిని పూర్తిస్థాయిలో తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాదిలో పెద్దఎత్తున తాజా నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఐటీ రంగంలో వస్తున్న మార్పులు, సంబంధిత ఇతర అంశాలపై ఆమె 'ఈనాడు'కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ప్రశ్న: కృత్రిమ మేధ- యంత్ర అభ్యాసం వల్ల ఎటువంటి మార్పులు సంభవిస్తాయి?

అన్ని వ్యాపార రంగాలను ‘డిజిటల్‌ విప్లవం’ చుట్టేస్తోంది. డిజిటల్‌- అనలిటిక్స్‌, ఐఓటీ, క్లౌడ్‌, సైబర్‌ సెక్యూరిటీ... తదితర విభాగాల్లో నూతన సాంకేతిక ఆవిష్కరణలు, సేవలు అన్ని రంగాలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ మార్పులకు హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ సన్నద్ధంగా ఉంది. దీనికి సంబంధించి అన్ని రకాల నైపుణ్యాలు మాకు ఉన్నాయి. మా సిబ్బంది ఈ విభాగాల్లో రాణించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. కొత్త సాంకేతిక విభాగాల్లో నైపుణ్యాలకు పదును పెడుతున్నాం.

ప్రశ్న: కొవిడ్‌-19 వల్ల ఐటీ పరిశ్రమలో ఎటువంటి మార్పులు వస్తున్నాయి?

కొవిడ్‌-19 ముందు, ఆ తర్వాత... అన్నట్లుగా మనం మాట్లాడుకోవచ్చు. అంతటి అనూహ్య మార్పు ఇది. ఇప్పటికే వ్యాపార కార్యకలాపాల తీరుతెన్నులు ఎంతో మారాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ ఆధారిత సేవలు విస్తరిస్తున్నాయి. మానవ ప్రమేయం తగ్గిపోతోంది. దీనికి తగ్గట్లుగా ఐటీ కంపెనీలు, సిబ్బంది మారాలి. కాలేజీ స్థాయిలోనే విద్యార్దులను కూడా సిద్ధం చేయాలి. దీనికి విద్యా సంస్థలు- పరిశ్రమ సమన్వయంతో కృషి చేయాలి. నిజజీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఏవిధంగా పరిష్కరించాలనే దానిపై విద్యార్ధులను తయారు చేయాలి. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ అమలు చేస్తున్న ‘టెక్‌బీ’ ప్రోగ్రామ్‌ ఈ దిశగా వినూత్నమైనదని చెప్పగలను. ఇంటర్‌ తర్వాత విద్యార్ధులు, 12 నెలల కాలవ్యవధి గల ‘టెక్‌బీ’ ప్రోగ్రామ్‌లో భాగస్వామి కావచ్చు. తద్వారా కోడింగ్‌, డిజైనింగ్‌, టెస్టింగ్‌... వంటి ఐటీ సేవలపై అవగాహన ఏర్పడుతుంది. దీనిపై శాస్త్ర డీమ్డ్‌ యూనివర్సిటీ, బిట్స్‌-పిలానీతో మేం భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాం.

ప్రశ్న: ఎటువంటి కొత్త టెక్నాలజీలకు భవిష్యత్తులో ఆదరణ అధికంగా ఉంటుంది?

సోషల్‌ ఇంటెలిజెన్స్‌, సిస్టమ్యాటిక్‌ థింకింగ్‌, ఇమాజినేషన్‌, ఇన్నోవేషన్‌, ఇంప్రొవైజేషన్‌తో కూడిన సాంకేతిక పరిజ్ఞానానికి రూపకల్పన జరుగుతోంది. ఇప్పటివరకు కేవలం టెక్నాలజీకే గిరాకీ ఉండటం చూశాం. ఇక ముందు అలా కాదు, మనిషి ఆలోచనలను టెక్నాలజీతో ముడిపెట్టి, ఫలానా సందర్భంలో మనుషులు ఎలా స్పందిస్తారు, ఎలా ఆలోచిస్తారు...? అనేది పసిగట్టి, అదేవిధంగా మెషీన్‌ కూడా స్పందించేందుకు వీలుకల్పించే పరిజ్ఞానం అందుబాటులోకి రావచ్చు. ఇటువంటి నైపుణ్యం ఉంటేనే ఇంజనీర్లకు మంచి అవకాశాలు లభిస్తాయి.

ప్రశ్న: తెలుగు రాష్ట్రాల్లో మీ విస్తరణ మాటేమిటి?

తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ప్రత్యేకత ఏమిటంటే..ఐటీ మానవ వనరుల లభ్యత ఎంతో అధికంగా ఉండటం. ఈ రెండు రాష్ట్రాల్లో కార్యకలాపాలు విస్తరిస్తాం. రెండో అంచె నగరాలకు ఐటీ కార్యకలాపాలను విస్తరించాలనే ప్రధాన లక్ష్యంలో భాగంగా విజయవాడలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ కేంద్రాన్ని నెలకొల్పాం. ఇంజనీర్లకు, నాన్‌-ఇంజనీర్లకు ఈ కేంద్రంలో ఉద్యోగాలు కల్పించేందుకు వీలుగా కార్యకలాపాలు చేపడతాం.

ప్రశ్న: శ్రీలంకలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ అభివృద్ధి కేంద్రానికి ప్రత్యేకత ఏమైనా ఉందా?

నైపుణ్యం గల మానవ వనరుల లభ్యత శ్రీలంకలో ఉంది. ఫైౖనాన్స్‌, అకౌంటింగ్‌, లీగల్‌, బీమా, బ్యాంకింగ్‌, టెలీకాం రంగాలకు సంబంధించి ఐటీఈఎస్‌ సేవలకు ఆఫ్‌షోర్‌ కేంద్రంగా శ్రీలంక ఎదుగుతోంది. అందువల్ల అక్కడ గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ (జీడీసీ) ఏర్పాటు చేశాం.

ప్రశ్న: హెచ్‌సీఎల్‌ నియామకాల ప్రణాళిక ఏమిటి?

2020-21లో 15,000 మంది ఉద్యోగులను నియమిస్తాం. ఇందులో 12,000 మంది కొత్త ఉద్యోగులు (ఫ్రెషర్స్‌) ఉంటారు. అంతేగాక శ్రీలంక జీడీసీలో వచ్చే మూడేళ్లలో 3,000 మంది సిబ్బందిని నియమిస్తాం.

వారంలో ఒకరోజు కార్యాలయానికి!

కొవిడ్‌-19 ప్రభావం ఆరంభం కాగానే సిబ్బంది ఇంటినుంచే పనిచేసే వెసులుబాటును హెచ్‌సీఎల్‌ కూడా కల్పించింది. దాదాపు 96 శాతం మంది ఇలానే పనిచేస్తున్నారు. క్రమేణ పరిస్థితులు మెరుగవుతున్నందున, చిన్న పిల్లలు-వృద్ధులైన తల్లిదండ్రులు చెంత లేని సిబ్బందిని వారానికి ఒకరోజు ఆఫీసుకు వచ్చి పనిచేయమని సంస్థ ప్రోత్సహిస్తోంది. డిసెంబరు కల్లా దీన్ని వారానికి 2 రోజులకు పెంచడం ద్వారా, 20 శాతం మంది సిబ్బంది కార్యాలయాల్లో ఉండేలా చూడాలన్నది సంస్థ ప్రణాళికగా చెబుతున్నారు. భౌతికదూరం నిబంధనలు పాటించేలా కార్యాలయాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం.

ఇదీ చూడండి: ఐదు రోజుల్లో కోటి ఆర్డర్లు డెలివరీ:ఫ్లిప్​కార్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.