ETV Bharat / business

'హోం లోన్' ఈఎంఐ కడుతున్నారా? ఇవి తెలుసుకోండి! - paying installments

Home Loan: సొంతిల్లు కొనడమంటే చాలామందికి ఒక పెద్ద కల నెరవేరినట్లే. దీనికి తీసుకున్న రుణానికి క్రమం తప్పకుండా చెల్లిస్తున్నన్ని రోజులూ ఇబ్బందులేమీ ఉండవు. ఒకసారి అనుకోని పరిస్థితుల్లో వాయిదాల బకాయి పేరుకుపోయిందా.. ఇక అది పీడకలగా మారుతుంది. ఇలాంటి సందర్భాల్లో రుణగ్రహీతపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చూడండి.

home loan
home loan
author img

By

Published : Jan 21, 2022, 11:53 AM IST

Home Loan: ఇప్పుడు అత్యంత తక్కువ వడ్డీకి లభిస్తున్న అప్పుల్లో గృహరుణం ఒకటి. మనకు అనుకూలమైన బ్యాంకు, ఆర్థిక సంస్థ నుంచి ఈ రుణాన్ని తీసుకోవచ్చు. వాయిదాలను సకాలంలో చెల్లించకపోతే రుణగ్రహీతకు ఎదురయ్యే ఇబ్బందులు ఎలా ఉంటాయన్నది తెలుసుకోవడమూ ఎంతో అవసరం.

మొండి బాకీగా..

వరుసగా మూడు నెలలపాటు గృహరుణం వాయిదాలను చెల్లించకపోతే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఆ బాకీని తాత్కాలిక డిఫాల్ట్‌గా పరిగణిస్తాయి. రుణగ్రహీతకు నోటీసులు పంపించడంలాంటి చర్యలు తీసుకుంటాయి. అప్పటికీ స్పందించకపోతే.. మరో మూడు నెలల తర్వాత రుణ వసూలుకు అవసరమైన చర్యలు తీసుకుంటాయి. మేజర్‌ డిఫాల్ట్‌గా పరిగణిస్తాయి. ఇంటి వేలానికి నోటీసులు ఇవ్వడం వరకూ వెళ్తాయి. వాయిదాలు ఆలస్యమైనప్పుడు బ్యాంకులు వాయిదా మొత్తానికి 1 నుంచి 2 శాతం వరకూ అపరాధ రుసుము విధిస్తాయి. మేజర్‌ డిఫాల్ట్‌గా మారితే.. ఆ రుణాన్ని మొండి బాకీగా (ఎన్‌పీఏ) నిర్ణయిస్తాయి. దీనికి ముందుగానే బ్యాంకులు రుణగ్రహీతకు పలు నోటీసులు ఇస్తాయి. కొన్ని సంస్థలు రుణ వసూలుకు థర్డ్‌ పార్టీ సేవలను వినియోగించుకుంటాయి. రుణం ఎన్‌పీఏగా మారితే.. రుణగ్రహీత, రుణదాతలకు మధ్య వివాదాలకు ఆస్కారం ఏర్పడుతుంది. అదే బ్యాంకు దగ్గర ఉన్న ఆ వ్యక్తికి ఉన్న ఇతర రుణాలూ ఈ ఎన్‌పీఏ ఖాతాకు అనుసంధానమవుతాయి. పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది.

క్రెడిట్‌ స్కోరుపై..

వాయిదాలను సరిగా చెల్లించకపోతే.. క్రెడిట్‌ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. తరచూ ఈఎంఐలు బ్యాంకులో జమ కాకపోతే క్రెడిట్‌ స్కోరు కనీస స్థాయికి పడిపోయే ఆస్కారమూ ఉంది. ప్రస్తుతం బ్యాంకులు తమ వడ్డీ రేట్లను రెపోకు అనుసంధానం చేశాయి. దీంతోపాటు రుణగ్రహీత క్రెడిట్‌ స్కోరు ఆధారంగా వడ్డీని నిర్ణయిస్తున్నాయి. తక్కువ క్రెడిట్‌ స్కోరు ఉంటే.. వడ్డీ రేటు పెరిగే ఆస్కారం ఉంది. మేజర్‌ డిఫాల్ట్‌ సందర్భంలో బ్యాంకులు ఎన్‌పీఏగా చూపిస్తే.. రుణం తీసుకున్న వ్యక్తి విశ్వసనీయత దెబ్బతింటుంది.

బదిలీ చేసుకోలేరు..

వడ్డీ ఎక్కువగా ఉండటం లేదా ఇతర కారణాలతో ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు రుణాన్ని మార్చుకోవాలనుకున్నా.. ఇబ్బందే. పాత బ్యాంకులో ఈఎంఐ సరిగా చెల్లించని కారణంగా కొత్త సంస్థ మీకు రుణాన్ని ఇచ్చేందుకు ఇష్టపడకపోవచ్చు. వ్యక్తిగత, వాహన, ఇతర కొత్త రుణాలు పొందడమూ ఇలాంటి వారికి కష్టం అవుతుంది.

పరిష్కారం ఏమిటి?

తాత్కాలికంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురై.. వాయిదాలను చెల్లించలేని పరిస్థితి వచ్చినప్పుడు తెలిసిన మిత్రులు, బంధువుల దగ్గర చేబదులు తీసుకోవచ్చు. మీకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బీమా పాలసీలు ఉంటే వాటిపై ఓవర్‌డ్రాఫ్ట్‌ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి. పరిస్థితులు సర్దుకున్నాక ఈ బాకీలన్నీ వెంటనే తీర్చేయాలి. ఒకవేళ మీకు ఆర్థిక అనిశ్చితి అధికంగా ఉన్నట్లు అనిపిస్తే.. ముందుగా తక్కువ వడ్డీ వస్తున్న పెట్టుబడి పథకాలను వెనక్కి తీసుకోండి. మొత్తంగా కోలుకోని పరిస్థితి ఉందని భావించినప్పుడు రుణ భారం వదిలించుకునేందుకు ఆ ఇంటిని విక్రయించడంలాంటివి తప్ప మార్గం ఉండదు.

లోన్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల్లాంటివి కొన్నాళ్లపాటు ఈఎంఐ చెల్లించకపోతే ఆదుకుంటాయి. ఇలాంటివాటిని ఎంచుకోవచ్చు. తాత్కాలికంగా ఉద్యోగం పోయినప్పుడు, ఆదాయం కోల్పోయినప్పుడు ఈ పాలసీ ఆదుకుంటుంది.

కనీసం 6 నెలల ఈఎంఐకి సరిపోయే మొత్తాన్ని ఎప్పుడూ అత్యవసర నిధిగా అందుబాటులో ఉంచుకోవాలి. దీనివల్ల మీపై ఆర్థిక ఒత్తిడి పడదు. తక్కువ ఈఎంఐ ఉండేలా రుణ వ్యవధిని ఎంచుకోవడం, మీ స్తోమతకు అనుగుణంగానే రుణాన్ని తీసుకోవడం ఎప్పుడూ సురక్షితం.

''పరిస్థితులు చేజారిపోతున్నాయని భావించినప్పుడు.. బ్యాంకును సంప్రదించి, పరిష్కార మార్గం గురించి ఆలోచించాలి. రుణ పునర్‌వ్యవస్థీకరణ, మారటోరియంలాంటివి మీకు కొంత ఊరట కలిగించవచ్చు.''

- అధిల్‌ శెట్టి, సీఈఓ, బ్యాంక్‌బజార్‌.కామ్‌

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: ఉద్యోగం మారేందుకే 82 శాతం మొగ్గు.. అదే కారణం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.