ప్రభుత్వ రంగ సంస్థ 'హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్)' ఆదాయంలో 6 శాతం వృద్ధి నమోదు చేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.19,400 కోట్ల ఆదాయం గడించింది. ఇది 2017-18లో 18,284 కోట్లుగా ఉంది.
"2018-19 ఆర్థిక సంవత్సరంలో సంస్థ పనితీరు మెరుగుపడింది. ఇది దేశీయంగా కొత్త డిజైన్లు, సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ప్రోత్సాహం అందిస్తుంది. "
-ఆర్.మాధవన్, హాల్ ప్రధాన మేనేజింగ్ డైరెక్టర్
గడిచిన ఆర్థిక సంవత్సరంలో 41 కొత్త విమానాలు, హెలికాప్టర్లు, 98 కొత్త ఇంజిన్ల ఉత్పత్తి చేసినట్లు వెల్లడించింది హాల్. అదే విధంగా 213 విమానాలు, హెలికాప్టర్లతో సహా 540 ఇంజిన్లకు మరమ్మతులు చేసినట్లు తెలిపింది.
"భారత సైన్యం కోసం తయారుచేస్తున్న 40 తేలికపాటి హెలికాప్టర్లలో ఇప్పటికే 12 అందించాం. త్వరలోనే మరో ఆరు అందిస్తాం."
- హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్