వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు వరుసగా మూడో నెలలోనూ రూ.లక్ష కోట్లు దాటాయి. ఈ ఏడాది జనవరిలో రూ.1,10,828 కోట్ల జీఎస్టీ వసూలైనట్లు అధికారిక గణాంకాల్లో వెల్లడైంది.
ఇందులో దేశీయ వసూళ్ల వాటా రూ.86,453 కోట్లు, ఐజీఎస్టీ, సెస్సుల వాటా రూ.23,597 కోట్లుగా ఉన్నాయి.
గత ఏడాది డిసెంబర్లో జీఎస్టీ వసూళ్లు రూ.1.03 కోట్లుగా ఉండటం గమనార్హం.
జనవరి 30 నాటికి మొత్తం 82.8 లక్షల జీఎస్టీఆర్ 3బీ రిటర్నులు దాఖలైనట్లు అధికారిక గణాంకాలు తెలిపాయి.
వసూళ్ల లెక్కలు..
- కేంద్ర జీఎస్టీ రూ.20,944 కోట్లు
- రాష్ట్రాల జీఎస్టీ రూ.28,224 కోట్లు
- సమీకృత జీఎస్టీ రూ.53,013 కోట్లు
- సెస్ రూ.8,637 కోట్లు
- మొత్తం రూ.1,10,828 కోట్లు