ETV Bharat / business

ఉద్యోగుల చేతికే ఎయిర్​ ఇండియా! - ఎయిర్​ఇండియా బిడ్ల దాఖలుకు చివరి తేదీ

అప్పుల ఊబిలో చిక్కుకున్న ప్రభుత్వ రంగ విమాన సంస్థ ఎయిర్ ​ఇండియా కొనుగోలుకు సంస్థ ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకోసం 209 మందితో కూడిన బృందం.. ఓ ఫినాన్షియర్ భాగస్వామ్యంతో బిడ్​ దాఖలు చేసేందుకు సిద్ధమైంది. సంస్థ కొనుగోలుకు ఉద్యోగుల నుంచి రూ.లక్ష చొప్పున సేకరించనున్నట్లు తెలిసింది.

Employees' interest in Air India acquisition
ఎయిర్​ఇండియా కొనుగోలుకు ఉద్యోగుల బిడ్​
author img

By

Published : Dec 4, 2020, 7:44 PM IST

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను సంస్థ ఉద్యోగులే కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం 209 మంది ఉద్యోగులు బృందంగా ఏర్పడి.. ఓ ఫినాన్షియర్ భాగస్వామ్యంతో ఎయిర్​ ఇండియాకు కొనుగోలు ఆసక్తి వ్యక్తీకరణ(ఈఓఐ) బిడ్ దాఖలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ బిడ్​ ప్రక్రియను ఎయిర్​ ఇండియా వాణిజ్య కార్యకలాపాల డైరెక్టర్ మీనాక్షీ మాలిక్ నిర్వహిస్తున్నారు.

14న ముగియనున్న గడువు..

'ఉద్యోగులు ఎయిర్​ ఇండియా నిర్వహణను తీసుకునేందుకు ప్రిలిమ్నరీ ఇన్​ఫర్మేషన్ మెమొరాండమ్​ (పీఐఎం) వీలుకల్పించింది. ఇది పూర్తయ్యేందుకు కచ్చితంగా పూర్తిచేయాల్సిన నిబంధనలను సూచించింది. మనమంతా వాటిని కలిసికట్టుగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.' అని మీనాక్షీ మాలిక్ తోటి ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఎయిర్​ ఇండియా కొనుగోలుకు ఈఓఐ​ దాఖలు చేసేందుకు ఈ నెల 14న గడువు ముగియనున్న నేపథ్యంలో ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది గ్రూప్.

ఆర్థిక ఇబ్బందుల్లో పడొద్దు..

సంస్థలో 51 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఉద్యోగులంతా ఆర్థిక సహాకారం అందించాల్సి ఉంటుందని మాలిక్​ తెలిపారు. ఫినాన్షియర్ అందుబాటులో ఉన్న కారణంగా ఉద్యోగులు రూ.లక్ష రూపాయలు ఇస్తే సరిపోతుందని వివరించారు. బిడ్డింగ్ మొదటి దశ దాటే వరకు డబ్బు అవసరం లేదని.. ఈ దశ పూర్తయ్యకే డబ్బులు సేకరించనున్నట్లు వెల్లడించారు. ఉద్యోగుల్లో ఎవ్వరూ రూ.లక్ష కన్నా ఎక్కువ ఇచ్చేందుకు ప్రయత్నించి ఆర్థికంగా ఇబ్బందులు పడొద్దని సూచించారు.

ఈ ప్రాజెక్టు విజయవంతమయ్యే వరకు ఇందులో భాగస్వామ్యం కాని వారితో, ఇతరులతో దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం పంచుకోవద్దని మాలిక్​ సూచించారు. అలా చేస్తే బిడ్​ చేజారే ప్రమాదముందని హెచ్చరించారు.

ఇదీ చూడండి:ఆర్​బీఐ ఎంపీసీ నిర్ణయాలపై నిపుణుల హర్షం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.