యెస్ బ్యాంకులో వాటా కొనుగోలుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఎస్బీఐ బోర్డు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. యెస్ బ్యాంకులో 8 శాతం వాటా ఉన్న.. ఎల్ఐసీని కూడా వాటా కొనుగోలులో పాల్గొనాలని ఎస్బీఐ కోరినట్లు తెలుస్తోంది.
యెస్‌బ్యాంకులో ఎస్బీఐ వాటా కొంటే.. ఒక ప్రైవేటురంగ బ్యాంకుకు ప్రభుత్వరంగ బ్యాంకు బెయిల్ అవుట్ ఇవ్వడం చాలా ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి అవుతుంది. యెస్‌బ్యాంకులో వాటా కొనుగోలు చేయాలంటే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్‌లో సవరణలు చేయాల్సి ఉంటుంది.
మరోవైపు యెస్‌బ్యాంకుపై మారటోరియం విధిస్తూ ఆర్బీఐ ఆదేశాలు జారీచేసింది. ఖాతాదార్లకు ఒక్కో ఖాతా నుంచి నెలకు రూ.50 వేలు మాత్రమే నగదు ఉపసంహరణకు వీలుంటుందని తెలిపింది.
ఇదే సమయంలో తక్షణం యెస్‌బ్యాంకు బోర్డును రద్దు చేసింది. అడ్మినిస్ట్రేటర్‌గా ఎస్బీఐ మాజీ ఛీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ప్రశాంత్ కుమార్‌ను నియమించింది. ఎస్బీఐ, ఇతర ఆర్థిక సంస్థలు యెస్‌బ్యాంకులో వాటా కొంటున్నాయని బెయిల్ అవుట్ ప్రకటిస్తాయని వార్తలు వచ్చిన గంటల్లోనే ఆర్బీఐ ఈ చర్య చేపట్టింది.
- ఇదీ చూడండి: నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్ మరోమారు తిరస్కరణ