బంగారం ధరలు వరుసగా నాలుగో రోజూ పెరిగాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర నేడు రూ.25 పెరిగి.. సరికొత్త జీవితకాల గరిష్ఠమైన రూ.38,995కు చేరింది.
రూపాయి క్షీణత కొనసాగతున్న నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతున్నట్లు ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ తెలిపింది. వెండి మాత్రం స్థిరంగా కిలోకు రూ.45,100 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో పసిడిపై మక్కువ తగ్గినప్పటికీ.. నగల వ్యాపారుల నుంచి పెరిగిన డిమాండు ధరల పెరుగుదలకు కారణమని ట్రేడర్లు అంటున్నారు.
అంతర్జాతీయ విపణిలో ఔన్సు బంగారం ధర 1,496.30 డాలర్లుగా ఉంది. వెండి కిలోకు 17.11 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది.
ఇదీ చూడండి: మన రోడ్లపై పెరుగుతున్న లగ్జరీ కార్ల రయ్ రయ్