పసిడి ధరలు ఇటీవలి రికార్డు స్థాయిల నుంచి కాస్త తగ్గినట్లు అనిపించినా... తిరిగి నేటి సెషన్లో భారీగా పెరిగాయి. ఒక్క రోజులోనే 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.475 వృద్ధి చెందింది. ప్రస్తుతం 10 గ్రాముల పసిడి ధర దిల్లీలో రూ.38,420కు చేరింది.
దేశీయంగా నగల వ్యాపారుల నుంచి పెరిగిన గిరాకీతో పుత్తడి ధరలు పుంజుకున్నట్లు ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ తెలిపింది.
బంగారం బాటలోనే వెండి ధరలూ పుంజుకున్నాయి. కిలో వెండి ధర దిల్లీలో రూ.378 పెరిగి.. రూ.44,688కి చేరింది. పరిశ్రమలు, నాణేల తయారీదారుల కొనుగోళ్ల వృద్ధితో వెండి ధరలు పెరిగాయి.
అంతర్జాతీయంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఔన్సు బంగారం ధర 1,513 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 17.26 డాలర్లుగా ఉంది.
హాంగ్‌కాంగ్‌లో రోజురోజుకూ పెరుగుతున్న నిరసనలు, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ భయాలు అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర తగ్గుదలకు కారణమని నిపుణులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'వన్ ప్లస్' స్మార్ట్ టీవీ వచ్చేది ఎప్పుడంటే...