రిలయన్స్ రిటైల్‌తో ఒప్పందం విషయంలో యథాపూర్వ స్థితిని కొనసాగించాలన్న దిల్లీ హైకోర్టు అదేశాలపై ఫ్యూచర్ రిటైల్ అప్పీలుకు వెళ్లింది. ప్యూచర్ రిటైల్ తన అప్పీల్‌ను హైకోర్టు జాయింట్ రిజిస్ట్రార్ ముందు ఉంచగా.. గురువారం దీనిపై విచారణకు అనుమతించినట్లు ఈ వ్యవహారంతో సంబంధమున్న న్యాయవాది తెలిపారు.
రిలయన్స్ రిటైల్, ఫ్యూచర్ రిటైల్ ఒప్పందం విషయంలో అమెజాన్ అభ్యంతరం సంతృప్తికరంగా ఉందని.. జస్టిస్ జేఆర్ మిదా మంగళవారం అభిప్రాయపడ్డారు. దీనితో రిజర్వు చేసిన తీర్పు వెలువరించే వరకు యథాపూర్వ స్థితిని కొనసాగించాలని ఫ్యూచర్ రిటైల్‌ను ఆదేశించారు. ఈ నేపథ్యంతో హైకోర్టు ఆదేశాలను సవాలు చేసింది కిశోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ రిటైల్.
ఇదీ చదవండి:'ఫ్యూచర్'తో వివాదంలో అమెజాన్‌కు ఊరట