ETV Bharat / business

'లాక్​డౌన్​ వద్దు.. కఠిన నిబంధనలే మేలు'

మరోసారి దేశవ్యాప్తంగా లాక్​డౌన్ విధించొచ్చన్న అంచనాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచనలు చేశాయి. లాక్​డౌన్ బదులు సిబ్బంది సంరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తూ కార్యకలాపాలు సాగించేలా ప్రభుత్వ చర్యలు ఉండాలని కోరాయి. భారత పరిశ్రమల సమాఖ్య చేసిన సర్వేలో ఈ విషయాలు తెలిశాయి. సర్వే వెల్లడించిన మరిన్ని కీలక విషయాలు ఇలా ఉన్నాయి.

Indian Companies suggestions against lockdown
లాక్​డౌన్​ వద్దు కఠిన నిబందనలు ఓకే
author img

By

Published : Apr 12, 2021, 5:59 PM IST

దేశంలో కరోనా రెండో దశ విజృంభిస్తోంది. ఒక్క రోజులో 1.7 లక్షల మందికి కరోనా కేసులు వచ్చాయంటే తీవ్రత ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూ పెడుతున్నాయి. లాక్​డౌన్ కూడా విధించొచ్చనే అంచనాలు ఉన్నాయి. అయితే మరోసారి లాక్​డౌన్​ పెట్టొద్దని దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాయని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) చేసిన ఓ సర్వే వెల్లడించింది.

దేశ్యాప్తంగా 710 కంపెనీల సీఈఓలు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఇందులో రెండింట మూడు వంతుల మంది చిన్న, మధ్య తరహా కంపెనీల(తయారీ, సేవా రంగ సంస్థలు) సీఈఓలు ఉన్నారు. ఈ కంపెనీలు దేశవ్యాప్తంగా ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నాయి.

సర్వేలో తేలిన విషయాలు..

  • కరోనా నుంచి జీవితాలతో పాటు జీవనాధారాన్ని (ఉపాధి) కాపాడాల్సిన అవసరం ఉందని 700 మందికిపైగా సీఈఓలు అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని పరిగణించి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
  • పాక్షికంగా లాక్​డౌన్​ విధించినా.. కార్మికులు, ఫ్యాక్టరీల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతుందని మూడింట నాల్గొంతుల మంది సీఈఓలు చెప్పారు.
  • లాక్​డౌన్ విధిస్తే తమ ఉత్పత్తి సామర్థ్యం సగానికిపైగా పడిపోతుందని 60 శాతం మంది సీఈఓలు తెలిపారు.
  • లాక్​డౌన్​ విధించకుండా.. ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం కఠినమైన నిబంధనలను తెస్తే.. వాటిని అమలు చేసేందుకు 96 శాతం కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి.
  • ఉద్యోగులకు టీకా కోసమయ్యే ఖర్చు భరించేందుకు, అవసరమైతే పని స్థలాల్లోనే వసతి కల్పించేందుకూ సిద్ధంగా ఉన్నట్లు 57 శాతం మంది సీఈఓలు పేర్కొన్నారు.
  • 45 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు వారికి టీకా వేసే కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు కూడా కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి.
  • అన్ని షిఫ్ట్​లలో సిబ్బంది ప్రయాణాలకు అనుమతినివ్వాలని 60 శాతం మంది సీఈఓలు ప్రభుత్వాలకు సూచించారు.
  • ఇలాంటి పరిస్థితులను ముందే పసిగట్టిన కంపెనీలు.. ఎంత ఖర్చు అయినా.. సప్లయి ఆగకుండా చర్యలు తీసుకున్నాయి. ముందస్తుగా అవసరమైన దానికంటే ఎక్కువ ముడి సరకును కూడా తెచ్చిపెట్టుకున్నాయి. ఈ కారణంగా ఫ్యాక్టరీల కార్యకలాపాలు ఆగిపోతే భారీగా నష్టం వాటిల్లుతుందని ప్రభుత్వాలకు విన్నవిస్తున్నాయి.

ఇదీ చదవండి:2020-21లో తగ్గిన ప్యాసింజర్​ వాహన విక్రయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.