సుప్రీంకోర్టు ఆగ్రహించిన నేపథ్యంలో టెల్కోలకు షాకిచ్చింది టెలికాం శాఖ. ఏజీఆర్ బకాయిలు రూ.1.47 లక్షల కోట్లను ఈ రోజే చెల్లించాలని ఆదేశించింది. ఇవాళ రాత్రి 11.59 గంటలలోపు చెల్లించాలని స్పష్టంచేసింది.
బకాయిల విషయంలో తమ తీర్పుపై టెలికాం శాఖ డెస్క్ అధికారి స్టే విధించటాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. న్యాయస్థానం ఇచ్చిన గడువులోపు బకాయిలు చెల్లించని కారణంగా.. ఈ విషయం కోర్టు ధిక్కరణ కిందికి ఎందుకు రాదని ప్రశ్నించింది.
సుప్రీం ఆగ్రహంతో టెలికాం శాఖ తక్షణమే దిద్దుబాటు చర్యలకు దిగింది. బకాయిలు చెల్లించకపోతే టెల్కోలపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఇచ్చిన ఉత్తర్వులను ఈ రోజు ఉదయం ఉపసంహరించుకుంది.
ఇదీ చూడండి: సుప్రీం తలంటు - డీఓటీ ఉత్తర్వు ఉపసంహరణ