ETV Bharat / business

స్టేట్​ బ్యాంక్​ శుభవార్త- వడ్డీరేట్లు తగ్గింపు

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్​బీఐ మరోసారి వడ్డీరేట్లను తగ్గించింది. కొత్త రేట్లు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఎస్​బీఐ వడ్డీరేట్లను తగ్గించడం ఇది పదోసారి.

sbi
ఎస్​బీఐ వడ్డీరేట్లలో తగ్గింపు
author img

By

Published : Mar 11, 2020, 1:23 PM IST

దేశీయ బ్యాంకింగ్‌ రంగ దిగ్గజం ఎస్‌బీఐ మరోసారి వడ్డీరేట్లను తగ్గించింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎంసీఎల్‌ఆర్‌ రేటులో 15 బేసిస్‌ పాయింట్ల మేరకు కోత విధించినట్లు పేర్కొంది. ఇది మార్చి 10 తేదీ నుంచే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐ వడ్డీరేట్లను తగ్గించడం ఇది పదోసారి కావడం విశేషం.

కొత్త వడ్డీరేట్లు ఇలా..

  • ఏడాది ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీరేటు 10బేసిస్‌ పాయింట్లు తగ్గి 7.75శాతంగా నిలిచింది. గతంలో ఇది 7.85శాతంగా ఉండేది.
  • ఒక నెల ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీరేటుపై 15 బేసిస్‌ పాయింట్లు తగ్గి 7.45శాతం అయింది.
  • మూడు నెలల ఎంసీఎల్‌ఆర్ వడ్డీరేటు 7.65శాతం నుంచి 7.50శాతానికి తగ్గింది.
  • ఇక రెండేళ్ల ఎంసీఎల్‌ర్‌ వడ్డీరేటు 10 బేసిస్‌ పాయింట్లు తగ్గి 7.95గా ఉండగా.. మూడేళ్ల ఎంసీఎల్‌ర్‌ రేటు కూడా 10 బేసిస్‌ పాయింట్లు తగ్గి 8.05శాతంగా ఉంది.
  • ఎఫ్‌డీలపై కూడా వడ్డీరేట్లను ఎస్‌బీఐ తగ్గించింది. గతంలో ఫిబ్రవరి 10వ తేదీన కూడా ఒకసారి వడ్డీరేట్లను తగ్గించడం విశేషం. కొత్తగా తగ్గిన వడ్డీరేట్లు మార్చి10 నుంచే అమల్లోకి వచ్చాయి.

సాధారణ ప్రజలకు ఎస్‌బీఐ అందించే తాజా ఎఫ్‌డీ రేట్లు

  • 7 రోజుల నుంచి 45 రోజుల వరకు - 4 శాతం
  • 46 రోజుల నుంచి 179 రోజుల వరకు - 5 శాతం
  • 180 రోజుల నుంచి 210 రోజుల వరకు- 5.5 శాతం
  • 211 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ - 5.5 శాతం
  • సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ- 5.9 శాతం
  • రెండు సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ - 5.9 శాతం
  • మూడు సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ - 5.9 శాతం
  • ఐదు సంవత్సరాలు నుంచి 10 సంవత్సరాల వరకు - 5.9 శాతం
  • సీనియర్ సిటిజన్లకు ఎస్‌బీఐ అందించే ఎఫ్‌డీ రేట్లు ఇలా..
  • ఏడు రోజుల నుంచి 45 రోజుల వరకు - 4.5 శాతం
  • 46 రోజుల నుంచి 179 రోజుల వరకు - 5.5 శాతం
  • 180 రోజుల నుంచి 210 రోజుల వరకు - 6 శాతం
  • 211 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ - 6 శాతం
  • సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ - 6.4 శాతం
  • రెండు సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ - 6.4 శాతం
  • మూడు సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ - 6.4 శాతం
  • ఐదు సంవత్సరాలు నుంచి 10 సంవత్సరాల వరకు - 6.4 శాతం

యూబీఐ కొత్త వడ్డీరేట్లు నేటి నుంచి..

మరోపక్క యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా రెండు రోజుల క్రితం ఎంఎసీఎల్‌ఆర్‌ రేటును 10 బేసిస్‌ పాయింట్ల మేరకు తగ్గించింది. ఇది నేటి నుంచి అమల్లోకి రానుంది. ఎస్​బీఐ వరుసగా తొమ్మిదోసారి వడ్డీరేట్లను తగ్గించడం విశేషం.

ఎంసీఎల్‌ఆర్‌ అంటే..

రుణం తీసుకోవడానికి బ్యాంకులకు వెళ్లేవారికి ఎంసీఎల్‌ఆర్‌ను ఆధారంగా చేసుకొని రుణం ఇస్తారు. గతంలో బేస్‌రేట్‌ ఆధారంగా రుణం ఇచ్చేవారు. ఇప్పుడు ఎంసీఎల్‌ఆర్‌ను ప్రామాణికింగా చేసుకొన్నారు. బ్యాంకులు నిధుల సమీకరణకు అయ్యే ఖర్చు(మార్జినల్‌ కాస్ట్‌) ఆధారంగా ఈ ఎంసీఎల్‌ఆర్‌ను నిర్ణయిస్తారు. ఆర్‌బీఐ బ్యాంకులకు నిధులను ఇచ్చే రేటును రెపోరేటు అంటారు. ఈ రేటు తగ్గినప్పుడల్లా ఎంసీఎల్‌ఆర్‌ తగ్గుతుంది. ఫలితంగా బ్యాంకులకు ఆర్‌బీఐ ఇచ్చే వడ్డీరేటుకు.. బ్యాంకులు వినియోగదారులకు ఇచ్చే వడ్డీరేటుకు మధ్య అంతరం తగ్గుతుంది. అప్పుడు ఆర్‌బీఐ అందించే ప్రయోజనాలు వినియోగదారులకు చేరతాయి.

లాభాలు ఇవే..

  • తక్కువ రేటుకే గృహ, వాహన రుణాలు లభిస్తాయి.
  • ఇప్పటికే పాతవిధానంలో రుణం తీసుకొన్నవారు ఎంసీఎల్‌ఆర్‌ పద్ధతికి మారవచ్చు. అప్పుడు వడ్డీరేట్లు తగ్గి ప్రయోజనం సమకూరుతుంది.
  • ఆర్‌బీఐ రేటు తగ్గించగానే ఆ ప్రయోజనం వినియోగదారులకు అందుతుంది.

ఇదీ చూడండి: 'కరోనా భయోత్పాతంతో 148 లక్షల కోట్ల నష్టం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.