ETV Bharat / business

విదేశీ కంపెనీల్లో చైనా గూఢచర్యం! - విదేశీ కంపెనీల్లో చైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యులు

చైనాలోనే కరోనా వైరస్ పుట్టిందని అమెరికా చాలా రోజులుగా ఆరోపణలు చేస్తోంది. ఈ వివాదం కొనసాగుతుండగానే.. గూఢాచర్యానికి సంబంధించి ఇటీవల లీకైన డేటాతో మిగతా అన్ని దేశాలు ఇప్పుడు చైనాను అనుమానంగా చూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంతకీ ఆ డేటాలో ఏముంది?

CCP in Western companies
విదేశీ కంపెనీల్లో చైనా గుఢాచారులు
author img

By

Published : Dec 14, 2020, 1:40 PM IST

పొట్టోడి నెత్తిని పొడుగోడు కొడితే.. పొడుగోడి నెత్తిని పోచమ్మ కొట్టిందట..! ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గూఢచారులను పెట్టి చైనా సమాచారం సేకరిస్తోంది. ఇప్పుడు చైనా కమ్యూనిస్టు పార్టీ సమాచారం మొత్తాన్ని ఎవరో వచ్చి పట్టుకుపోయి లీక్‌ చేశారు. తీరా అందులో ఏముందయ్యా అంటే.. చైనా నియమించిన వేగుల జాబితా.. వివిధ కంపెనీల్లో కొలువుదీరిన చైనా ఇన్ఫార్మర్ల సమాచారం..! ఫలితంగా ప్రతి దేశం చైనాను అనుమానంతో చూడాల్సిన పరిస్థితి. 'ద ఆస్ట్రేలియన్‌', 'ద మెయిల్‌', 'న్యూయార్క్‌ పోస్ట్' 'స్కైన్యూస్‌' వంటి పత్రికలు ఈ విషయంపై సంచలన కథనాలు వెలువరించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీల్లో చైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యులు తిష్ట వేశారని పేర్కొన్నాయి. వీటిల్లో రక్షణ రంగానికి చెందినవి, బ్యాంకులు, ఫార్మాస్యూటికల్స్‌తోపాటు చివరికి కరోనా వ్యాక్సిన్‌ ఉత్పత్తి సంస్థల్లో వీరు ఉన్నారని స్పష్టంచేశాయి. ఆస్ట్రేలియా కమాండోలు అఫ్గానిస్థాన్‌లో అరాచకం చేశారంటూ చైనా విదేశాంగశాఖ ప్రతినిధి కొన్ని ఫొటోలను విడుదల చేసిన కొద్ది రోజుల్లోనే ఆస్ట్రేలియ పత్రికలో ఈ లీక్‌ కథనం రావడం గమనార్హం.

ఈ డేటా ఎక్కడిది?

షాంఘైలోని ఓ కీలక సర్వర్‌ నుంచి 2016లో ఈ డేటాను వెలికి తీశారు. ఈ సర్వర్‌ను కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ అవసరాల కోసం వినియోగిస్తారు. చైనా నుంచి పారిపోయిన కొందరు ప్రజా వేగులు వీటిని లీక్‌ చేశారు. ఈ డేటాను లీక్‌ చేసే ముందు చైనాతో ప్రజాస్వామ్య దేశాల సంబంధాలను పరిశీలించే 'ద ఇంటర్‌ పార్లమెంటరీ అలయెన్స్‌ ఆన్‌ చైనా'కు కూడా అందజేశారు. అనంతరం ద ఆస్ట్రేలియన్‌, మెయిల్‌ ఆన్‌ సన్‌డే, ద స్టాండర్డ్‌, ఎడిటర్‌ పత్రికల కన్సార్టియమ్‌కు చేరింది.

వీటిలో ఏముంది..?

ద ఆస్ట్రేలియన్‌ కథనం ప్రకారం మొత్తం 20 లక్షల మంది చైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యుల వివరాలు ఉన్నాయి. పార్టీలో వారి స్థానం, నేషనల్‌ ఐడీ నంబర్‌, జాతి వంటి కచ్చితమైన వివరాలు ఉన్నాయి. దీనితో పాటు వివిధ కంపెనీలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ ఏజెన్సీల్లో పనిచేస్తున్న 79,000 శాఖల వివరాలు కూడా బయటపడ్డాయి. సాధారణంగా వీరందరూ గూఢచారులని చెప్పడంలేదు. కానీ, సీసీపీ సభ్యులకు సున్నితమైన సమాచారం తెలిస్తే అది ఎప్పుడో ఒకప్పుడు చైనాకు చేరుతుందని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు బలంగా విశ్వసిస్తున్నాయి.

పాతుకుపోయిన సీసీపీ..

చైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యులు పలు దిగ్గజ సంస్థల్లో ఉన్నారు. ఈ సంస్థల జాబితాలో ఉత్పాదక రంగానికి చెందిన బోయింగ్‌, ఫోక్స్‌వేగన్‌, రోల్స్‌రాయిస్‌ వంటి సంస్థలు ఉండగా.. ఆర్థిక రంగానికి చెందిన ఏఎన్‌జెడ్‌, హెచ్‌ఎస్‌బీసీ వంటి సంస్థలు ఉన్నాయి. దీనితోపాటు కరోనావైరస్‌ టీకా ఉత్పత్తి చేస్తున్న ఫైజర్‌, ఆస్ట్రాజెనెకాలోనూ వీరు ఉన్నట్లు ఆయా ప్రత్రికలు కథనాల్లో పేర్కొన్నాయి. షాంఘైలోని ఆస్ట్రేలియా, యూకే, అమెరికా దౌత్య కార్యాలయాల్లో కూడా వీరు ఉన్నట్లు కథనాలు బయటపెట్టాయి. షాంఘై ఫారెన్‌ ఏజెన్సీ సర్వీసెస్‌ ద్వారా వీరు అక్కడ చేరినట్లు పేర్కొన్నాయి. ఇలా కంపెనీల్లో పనిచేస్తున్నవారు సీసీపీ బ్రాంచులను ఏర్పాటు చేసినట్లు స్కైన్యూస్‌ జర్నలిస్టు మార్క్‌సన్‌ వివరించారు. ఇలాంటి బ్రాంచులు నేరుగా సీసీపీకి బాధ్యత వహిస్తాయి. చాలా కంపెనీలు వీటిపై స్పందించేందుకు నిరాకరించాయి. ఏఎన్‌జెడ్‌ సంస్థ మాత్రం 'కంపెనీ నిబంధనలకు అనుకూలంగా పనిచేసినంత కాలం తాము ఉద్యోగుల రాజకీయ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోం' అని పేర్కొంది.

"సీసీపీ సభ్యుడు ఒకరు ఆసీస్‌ సబ్‌మెరైన్‌ ప్రాజెక్టులో పనిచేస్తున్నాడు అనుకుందాం. జలాంతర్గామి టెక్నికల్‌ డేటా అతనికి తెలుస్తుంది. అది కచ్చితంగా చైనా నౌకాదళానికి ఆధిక్యాన్ని ఇస్తుంది" అని ఈ డేటా లీక్‌పై ఆస్ట్రేలియాకు చెందిన ఓ ఇంటెలిజెన్స్‌ అధికారి పేర్కొన్నారు.

వాస్తవానికి ఛాన్‌ హాంగ్‌ అనే ఓ చైనా స్కాలర్‌ తరచూ ఆస్ట్రేలియాను సందర్శిస్తుంటే ఇంటెలిజెన్స్‌ వర్గాలు అనుమానించి అతని వీసాను రద్దు చేశాయి. అతని పేరు కూడా తాజాగా లీకైన జాబితాలో ఉంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాను విమర్శిస్తూ చాన్‌ గ్లోబల్‌ టైమ్స్‌లో ఆర్టికల్‌ రాశాడు.

రోబో చెయ్యి వివాదం ఓ ఉదాహరణ..

చైనా దొంగతనం చేసిన ఓ రోబో చెయ్యి టెక్నాలజీ కారణంగానే అమెరికాలో ఎమర్జెన్సీ కూడా విధించారు. హువావే సంస్థకు టి మొబైల్స్‌ అమెరికా వ్యాపార భాగస్వామి. టి మొబైల్స్‌కు చెందిన 'తాపీ' అనే రోబో చేయికి సంబంధించిన సాంకేతికతను హువావే దొంగిలించిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. నాణ్యమైన స్మార్ట్‌ ఫోన్లను అందించడమే లక్ష్యంగా కంపెనీలు పనిచేస్తున్నాయి. దీనికోసం భారీ మొత్తంలో పరిశోధనలకు వెచ్చిస్తున్నాయి. ఈ క్రమంలో టి-మొబైల్స్‌ సంస్థ 'తాపీ' పేరుతో ఒక యాంత్రిక చెయ్యిని అభివృద్ధి చేసింది. దీని వేళ్లు మనిషి వేళ్లలాగే పనిచేస్తాయి. దీనిని ఉపయోగించి ఒక మొబైల్‌ ఫోన్‌ను మనిషి గంటల తరబడి ఎలా వాడతారో అలానే వినియోగించి పరీక్షిస్తారు. సరికొత్త మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి విడుదల కావాలంటే ముందు తాపీ పరీక్షించాల్సిందే. ఈ క్రమంలో టి-మొబైల్స్‌సంస్థ హువావే వంటి స్మార్ట్‌ఫోన్‌ తయారీదార్లను తన ల్యాబ్‌లో స్మార్ట్‌ఫోన్లపై పరీక్షలు నిర్వహించుకునేందుకు అనుమతించింది.

ఈ క్రమంలో హువావే సొంతంగా ఇటువంటి రోబోను తయారు చేయాలనుకుంది. అంతే 2012లో టి-మొబైల్‌ ల్యాబ్‌లోకి తన అమెరికా విభాగం ఉద్యోగులు ప్రవేశించి పరీక్షలు నిర్వహించుకునేలా అనుమతులు సాధించింది. ఈ ఉద్యోగులు అక్కడి సమాచారాన్ని దొంగిలించి ఇచ్చేలా ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది. దీనితో అక్కడి హువావే ఉద్యోగులు ఆ రోబో గురించి టి-మొబైల్స్‌ ఉద్యోగులను అడగడం మొదలుపెట్టారు. కానీ, వారు ఎటువంటి సమాచారం ఇవ్వకపోగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఒక హువావే ఉద్యోగి మెయిల్‌ రూపంలో కంపెనీకి పంపించారు. ఏప్రిల్‌ 2013నాటికి హువావే ఉద్యోగులు తమ ల్యాబ్‌లోకి రాకుండా బ్యాన్‌ విధించాలనే ప్రతిపాదనలను టి-మొబైల్స్‌ పరిశీలించింది. దీనితో హువావే తొందరపడింది. ఒక చైనా ఇంజినీర్‌ను కూడా తమ ఉద్యోగులతో కలిపి టి-మొబైల్స్‌ ల్యాబ్‌లోకి పంపించి ఫొటోలు, ఇతర సమాచారాన్ని సేకరించింది. కానీ, గుంపుగా వచ్చే హువావే ఉద్యోగులు ఏం చేస్తున్నారో టి- మొబైల్స్‌కు అర్థమైంది. దీనితో ఒక్కో ఉద్యోగిని మాత్రమే పరీక్షలు నిర్వహించే తాపీ రోబో వద్దకు పంపింది. అయినా ఒక హువావే ఉద్యోగి ఆ రోబో చేయి ఒక దానిని ఇంటికి తీసుకెళ్లి దాని నుంచి సమాచారాన్ని తస్కరించాడు. పొరపాటున దానిని తనతో పాటు తీసుకెళ్లినట్లు చెప్పి మర్నాడు టి-మొబైల్స్‌కు అప్పగించాడు. దీనితో హువావే ఉద్యోగులను టి-మొబైల్స్‌ బ్యాన్‌ చేసింది. ఆ తర్వాత సాంకేతికత దొంగతనానికి పాల్పడిన ఉద్యోగులకు హువావే నజరానాలు అందజేసిందనే ఆరోపణలు వచ్చాయి. హువావే యజమాని గతంలో సీసీపీ సైనిక విభాగమైన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీలో ఇంజినీర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే.

ఇదీ చూడండి:ఎయిర్​ఇండియా కొనుగోలుకు నేడు టాటా గ్రూప్ బిడ్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.