ETV Bharat / business

సంక్షోభం అంచున చైనా సంస్థ 'హువావే' - సంక్షోభం అంచున హువావే

హువావే.. చైనాలోనే అతిపెద్ద సాంకేతిక దిగ్గజం. వార్షిక ఆదాయమే రూ.8 లక్షల 79 వేల కోట్లు. అయితే అలాంటి కంపెనీయే ఇక మార్కెట్లో 'కొనసాగడం' కష్టమని ఇటీవల వ్యాఖ్యలు చేసింది. అంత కష్టం ఏమొచ్చింది? ఆ కష్టం మన దేశంపైనా ప్రభావం చూపిస్తుందా? ఓసారి చూద్దాం.

Huawei on the brink of crisis
సంక్షోభం అంచున హువావే
author img

By

Published : Oct 4, 2020, 7:27 AM IST

చైనా సాంకేతిక దిగ్గజం హువావేకు ఎటు చూసినా చిక్కుముళ్లే కనిపిస్తున్నాయి. అమెరికా-చైనా మధ్య సాంకేతిక యుద్ధం తెస్తోన్న నష్టాలతో.. ఇక మార్కెట్లో కొనసాగడం కష్టమన్న వ్యాఖ్యలు వినపడుతున్నాయి. హువావే ఎందుకు అంత సంక్షోభంలో పడిందో తెలుసుకోవాలంటే.. అందుకు దారితీసిన పరిణామాలను పరిశీలించాలి.

ఎలక్ట్రానిక్స్‌, సాంకేతిక సామగ్రి తయారీలో సెమికండక్టర్లనేవి అత్యంత కీలకమైనవి. వీటి ఎగుమతులపై అమెరికా సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం.. ఏ విదేశీ కంపెనీ అయినా సెమీ కండక్టర్లను ఎగుమతి చేయాలంటే.. అమెరికా నుంచే అనుమతి తీసుకోవాలి. అది ఎలాగూ ఇవ్వదన్నది వేరే విషయం.

ఇలా ఎందుకు చేసిందంటే..

గతేడాది మే నెలలో అమెరికా సాంకేతికతను హువావేకు ఎగుమతి చేయకుండా తన కంపెనీలపై అమెరికా నిషేధం విధించింది. అయితే తైవాన్‌, జపాన్‌, దక్షిణ కొరియా వంటి తూర్పు ఆసియా కంపెనీలు తమ ఎలక్ట్రానిక్స్‌ తయారీలో అమెరికా సాంకేతికతను ఉపయోగించుకుంటాయి. దీంతో హువావేకు పెద్ద కష్టం కాలేదు. ఆ నిషేధం పనిచేయలేదు. దీంతో ఆ చైనా కంపెనీకి ఇతర దేశాల నుంచీ సాంకేతికత వెళ్లకుండా అడ్డుకునేందుకే కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.

అందుకే అలా..

ఈ కొత్త మార్గదర్శకాల ప్రభావంతో తమ విస్తరణ, నిర్వహణ, కార్యకలాపాలను కొనసాగించడం వంటివి కష్టమవుతుందని హువావే చెప్పింది. 170 దేశాలకు పైగా వందల బిలియన్‌ డాలర్ల విలువ చేసే ఈ నెట్‌వర్క్‌ను కొనసాగించడం ఇబ్బందిగా మారింది. హువావే నుంచి ఆర్డర్లు తీసుకోవడం లేదని తైవాన్‌ కంపెనీ ఒకటి ప్రకటన వెలువరించింది కూడా. ఈ పరిస్థితుల్లో స్మార్ట్‌ఫోన్‌ నుంచి రిఫ్రిజిరేటర్ల వరకు అన్ని ఆధునిక ఎలక్ట్రానిక్‌ సామగ్రి తయారీలో అత్యంత అవసరమైన సెమీకండక్టర్ల విషయంలో హువావే వెనకబడి పోయినట్లే. ఎందుకంటే ఆర్డర్లు రాకుంటే ఏ కంపెనీ అయినా దిగాలు పడాల్సిందే కదా.

దెబ్బ మీద దెబ్బ..

కొన్నేళ్ల కిందట హువావే ఒక అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజంగా మారడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ఎందుకంటే అన్ని ప్రధాన ఐరోపా దేశాల్లో 5జీ మౌలిక వసతులను ఏర్పాటు చేసే కాంట్రాక్టులు దక్కించుకోవాలనుకుంది. అయితే కరోనా వైరస్‌ తర్వాత చైనాపై కోపం.. ఆ తర్వాత అమెరికా నిషేధంతో ఆ కంపెనీకి కష్టాలు చుట్టుముట్టాయి.

భారత '5జీ'పై ఎంత ప్రభావం?

అమెరికా, చైనాల మధ్య జరుగుతున్న సాంకేతిక యుద్ధం ఓ పక్కన కొనసాగుతూనే ఉండగా.. ఇపుడు 5జీ సాంకేతికత, సామగ్రి, సాఫ్ట్‌వేర్‌ విషయంలో సరఫరాదారుపై భారత నిర్ణయం కీలకంగా మారింది. సాంకేతిక-ఆర్థిక, వ్యూహాత్మక అంశాలు ఈ నిర్ణయాన్ని ప్రభావితం చేయొచ్చు. సాంకేతికత విషయానికొస్తే.. హువావే వంటి చైనా కంపెనీల మద్దతు లేకుంటే వ్యయాలు భారీ ఎత్తున పెరిగే అవకాశం ఉంది. అయితే కరోనాకు ముందు హువావేపై సానుకూలంగా ఉన్నా.. మహమ్మారి వచ్చాక.. మరీ ముఖ్యంగా గల్వాన్‌ తదితర పరిణామాల నేపథ్యంలో అసలు ఆ వైపుగా ప్రభుత్వం ఆలోచించే పరిస్థితి లేదు. అందుకు ప్రత్యామ్నాయంగా ఐరోపా కంపెనీలైన ఎరిక్‌సన్‌, నోకియాలపై ఆధారపడవచ్చు. అయితే చైనా సంస్థలతో పోలిస్తే ఇవి అందించే సరఫరాల ధర ఎక్కువగా ఉంటుంది. అది భారం కావొచ్చు. అందులోనూ మన టెలికాం కంపెనీలు(జియో తప్ప) ప్రస్తుతం భారీ అప్పుల్లో ఉన్నాయి. ఈ సమయంలో 5జీపై భారీ పెట్టుబడులకు ఎంత సిద్ధంగా ఉన్నాయన్నదీ ప్రశ్నే.

ఇదీ చూడండి: 'ఆ డీల్​ కుదరకుంటే.. టిక్​టాక్ నిషేధం తప్పదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.