వడోదర కేంద్రంగా పని చేస్తున్న స్పెషాలిటీ కెమికల్ ఉత్పత్తి సంస్థ.. తత్వ చింతన్ ఫార్మా షేర్లు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. ఎక్స్ఛేంజీల్లో లిస్టయిన తొలి రోజే ప్రీమియంతో పోలిస్తే.. బీఎస్ఈలో 111.49 శాతం లాభంతో రూ.2,290.40 వద్ద ట్రేడవుతున్నాయి. ఒకానొక దశలో.. షేరు విలువ రూ.2,339 గరిష్ఠాన్ని తాకింది. ప్రీమియం ధర రూ.1,083తో పోలిస్తే ఇది 116 (రూ.1,256) శాతం ఎక్కువ.
ఎన్ఎస్ఈలోనూ.. రూ. 2,268.85 వద్ద ట్రేడవుతోంది కంపెనీ షేరు.
ఈ నెల 16న తత్వ చింతన్ ఫార్మా ఐపీఓ ముగిసింది. ఇందులో 180 రెట్ల సబ్స్క్రిప్షన్లతో రికార్డు సృష్టించింది.
మరిన్ని..
- కొన్ని ఉత్పత్తుల విభాగంలో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద కంపెనీగా ఉంది తత్వ చింతన్.
- మెర్క్, బేయర్ ఏజీ, ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ వంటి నెట్‌వర్క్ కంపెనీలతో బలమైన కస్టమర్ సంబంధాన్ని కలిగి ఉంది ఈ కంపెనీ.
- తత్వ చింతన్ 25 దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది.
- 2021 మార్చి 31తో ముగిసిన సంవత్సరంలో తత్వ చింతన్ రూ. 300.35 కోట్ల ఆదాయాన్ని.. రూ. 52.26 కోట్ల లాభాన్ని ఆర్జించింది.
ఇదీ చదవండి: టాటా సన్స్ చేతికి తేజస్- డీల్ విలువ ఎంతంటే?