కారు కొనాలనే ఆలోచనలో ఉన్నారా? అయితే అందుకు ఇదే సరైన సమయం. ఎందుకంటే 2019 ముగుస్తున్న సందర్భంగా కార్ల తయారీ సంస్థలు భారీగా డిస్కౌంట్లు ఇస్తున్నాయి. దేశంలో ప్రధాన కార్ల తయారీ సంస్థలన్నీ ఆఫర్లు ప్రకటించడం గమనార్హం.
ఎందుకీ డిస్కౌంట్లు?
ఈ ఏడాది ముగింపు దశకు చేరుకుంది. ఈ నెలలో వీలైనన్ని ఎక్కువ యూనిట్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి కార్ల తయారీ సంస్థలు. ముఖ్యంగా ఇప్పటి వరకు మిగిలిపోయిన స్టాక్‌ను వీలైనంతవరకు తగ్గించుకోవాలన్నది ఆయా సంస్థల ఆలోచన. ఇందుకోసం భారీ డిస్కౌంట్లతో కార్లను విక్రయిస్తున్నాయి.
పాత స్టాక్‌ను తగ్గించుకోవడం సహా కార్లపై డిస్కౌంట్లు ఇచ్చేందుకు మరికొన్ని కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా 2020 ఏప్రిల్ నుంచి వాహనాలకు భారత్ స్టేజ్ (బీఎస్)-6 ఉద్గార నియమాలు తప్పనిసరి కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతమున్న బీఎస్-4 వాహనాలను వీలైనంత ఎక్కువగా, త్వరగా విక్రయించాలని భావిస్తున్నాయి ఆటోమొబైల్ సంస్థలు. వీటికితోడు ఈ ఏడాది భారీగా తగ్గిన వాహన విక్రయాలను డిస్కౌంట్లతోనైనా పెంచుకోవాలనేది ఆయా సంస్థల ప్యూహంగా తెలుస్తోంది.
డిస్కౌంట్లు ఇస్తున్న సంస్థలు ఇవే..
దేశీయంగా ప్రధాన కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ సహా హుందాయ్, హోండా, ఫోక్స్ వ్యాగన్, టాటా మోటార్స్ సంస్థలు డిస్కౌంట్లు ఇస్తున్న జాబితాలో ఉన్నాయి.
మారుతీ సుజుకీ:
కారు మోడల్ | డిస్కౌంట్ |
ఆల్టో 800 | రూ.60,000 |
బలీనో | రూ.45,000 |
ఎస్-క్రాస్ | రూ.1.13 లక్షలు |
సియాజ్ | రూ.75,000 |
ఇగ్నిస్ | రూ.65,000 |
హుందాయ్:
కారు మోడల్ | డిస్కౌంట్ |
శాంత్రో | రూ.55,000 |
వెర్నా | రూ.60,000 |
క్రెటా | రూ.95,000 |
ఎలాంట్రా | రూ.2 లక్షలు |
గ్రాండ్ ఐ10నియోస్ | రూ.20,000 |
ఫోక్స్ వ్యాగన్:
కారు మోడల్ | డిస్కౌంట్ |
పోలో | రూ.1.5 లక్షలు |
దీంతో పాటు కార్పొరేట్ ఆఫర్ కింద రూ.25,000, డిస్కౌంట్ బోనస్‌గా రూ.10,000 వరకు అందించనున్నట్లు ఫోక్స్ వ్యాగన్ వెల్లడించింది.
హోండా:
కారు మోడల్ | డిస్కౌంట్ |
అమేజ్ | రూ.42,000 |
జాజ్ | రూ.50,000 |
డబ్ల్యూఆర్-వీ | రూ.45,000 |
సిటీ సెడాన్ | రూ.62,000 |
సివిక్ | రూ.2 లక్షలు |
టాటా:
కారు మోడల్ | డిస్కౌంట్ |
టియాగో | రూ.75,000 |
హెక్సా | రూ.1.65 లక్షలు |
నెక్సాన్ | రూ.1.07 లక్షలు |
ఎస్యూవీ హారియర్ | రూ.65,000 |
ఇదీ చూడండి:ప్రపంచంలోనే 34వ శక్తిమంతమైన మహిళగా 'సీతమ్మ'