ఆదాయపన్ను శాఖ పేరుతో మీకేమైనా సందేశాలు వచ్చాయా? జాగ్రత్తగా ఉండండి అది నకిలీ సందేశం కావచ్చు. ఆదాయ పన్ను రీఫండ్ కోసం రిక్వెస్ట్ పెట్టండి అంటూ మీ మొబైల్‌కు మెసేజ్ పెట్టి మిమ్మల్నే బురిడీ కొట్టిస్తున్నారు ఆన్లైన్ చోరులు. అలాంటి సందేశాలు వచ్చినప్పుడు వెంటనే సైబర్ అధికారులకు ఫిర్యాదు చేయమని హెచ్చరిస్తోంది భారతీయ స్టేట్ బ్యాంక్.
ఈ మేరకు.. ప్రజల అవగాహన కోసం ట్విట్టర్లో ఓ వీడియోను పోస్టు చేసింది ఎస్‌బీఐ.
-
Received any message from the Income Tax Department, requesting you to put in a formal request for your refund? These messages are from fraudsters at play! Ensure you ignore and report the messages immediately. For more security tips, visit https://t.co/U3XVLPyP8W pic.twitter.com/vHCL2PBvyz
— State Bank of India (@TheOfficialSBI) November 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Received any message from the Income Tax Department, requesting you to put in a formal request for your refund? These messages are from fraudsters at play! Ensure you ignore and report the messages immediately. For more security tips, visit https://t.co/U3XVLPyP8W pic.twitter.com/vHCL2PBvyz
— State Bank of India (@TheOfficialSBI) November 1, 2019Received any message from the Income Tax Department, requesting you to put in a formal request for your refund? These messages are from fraudsters at play! Ensure you ignore and report the messages immediately. For more security tips, visit https://t.co/U3XVLPyP8W pic.twitter.com/vHCL2PBvyz
— State Bank of India (@TheOfficialSBI) November 1, 2019
ఇలా దోచేస్తారు..
నకిలీ మెసేజ్‌లో వచ్చిన లింక్‌ను క్లిక్ చేసిన వెంటనే ఐడీ, పాస్‌వర్డ్ వంటి వ్యక్తిగత వివరాలను అడుగుతున్నారు సైబర్ మోసగాళ్లు. వాటి సాయంతో బ్యాంకు ఖాతాల్లోని డబ్బులను దోచుకుంటున్నారని ఎస్‌బీఐ హెచ్చరించింది. అలాంటి అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయవద్దని, వ్యక్తిగత ఖాతా వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని స్పష్టం చేసింది ఎస్‌బీఐ.
ఆదాయపు పన్ను రీఫండ్ కోసం సంబంధిత వెబ్‌సైట్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేగానీ, కస్టమర్ల నుంచి ఎలాంటి ప్రత్యేక అభ్యర్థలను కోరదు ఐటీ శాఖ. అందుకే అలాంటి మెసేజ్‌లు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు సైబర్ నిపుణులు.
ఇదీ చూడండి: ఫోన్ మాట్లాడినందుకు డబ్బులు ఇచ్చే టెలికాం సంస్థ తెలుసా?