ఆన్లైన్ వ్యాపార దిగ్గజం అమెజాన్ ఫార్మా రంగంలోనూ ప్రవేశించింది. తన మొదటి ఆన్లైన్ ఫార్మసీ స్టోర్‌ను న్యూయార్క్‌లో ప్రారంభించింది. మరికొన్ని రోజుల్లో ఆన్లైన్ ద్వారా ఔషధాలను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించనుంది అమెజాన్.
ఇప్పటికే అన్ని రంగాల్లో పాగా వేసిన అమెజాన్.. ఇక ఔషధ పరిశ్రమలో అడుగుపెట్టింది. ఈ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించేందుకే అమెజాన్ ఇందులోకి వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం అతిపెద్ద సరఫరా వ్యవస్థలైన సీవీఎస్, వాల్‌గ్రీన్స్.. స్థిర కొనుగోళ్లు జరిగేందుకు వాళ్ల ఫార్మసీలపైనే పనిచేస్తాయి.
అయితే ప్రస్తుతానికి క్రీమ్స్, పిల్స్, జలుబు, ఇన్సులిన్ వంటి సాధారణ ఔషధాలు లభించనున్నాయి.
ఆరోగ్య సంరక్షణ రంగంపై అమెజాన్ దృష్టి పెట్టింది. రెండేళ్ల క్రితం 75 కోట్ల డాలర్లకు ఆన్లైన్ ఫిల్ప్యాక్ అనే సంస్థను కొనుగోలు చేసింది. ఈ పిల్‌ప్యాక్ కొనసాగుతుందని స్పష్టం చేసిన అమెజాన్.. దీర్ఘకాలిక వ్యాధులు ఔషధ సరఫరాపై దృష్టి పెట్టినట్లు స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: ఫ్లిప్‌కార్ట్ చేతికి అగ్‌మెంటెడ్ రియాల్టీ సంస్థ 'స్కాపిక్'