ETV Bharat / business

స్మార్ట్​ఫోన్లకు 12 ఎంపీ కెమెరా చాలట.. ఎందుకు?

ఎక్కువ మెగా పిక్సెల్​ ఉన్న స్మార్ట్​ఫోన్లకే ప్రస్తుతం గిరాకీ ఉంటోంది. ఈ కారణంగా స్మార్ట్​ఫోన్ తయారీ కంపెనీలు 48 ఎంపీ, 64 ఎంపీ కెమెరాలతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే టెక్​ నిపుణులు మాత్రం స్మార్ట్​ ఫోన్లకు 12 మెగా పిక్సెల్ కెమెరా చాలా ఎక్కువ అంటున్నారు. ఇందుకు కారణాలేంటో తెలుసుకోండి.

author img

By

Published : Dec 20, 2019, 7:01 AM IST

PIXEL_SRD
స్మార్ట్​ఫోన్లకు 12 ఎంపీ కెమెరా చాలట.. ఎందుకు?

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్​ సంస్థల మధ్య కెమెరా పిక్సెల్స్​ పోటీ నడుస్తోంది. ఈ ఏడాది ఈ పోటీ మరీ ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. అయితే దిగ్గజ సంస్థలైన యాపిల్​, శాంసంగ్​, గూగుల్ పిక్సెల్​లు మాత్రం తమ ప్రీమియం మోడల్​ ఫోన్లలో ఇంకా 12 మెగా పిక్సెల్​ కెమెరాను మాత్రమే వినియోగిస్తున్నాయి. ఇతర సంస్థలు తక్కువలో తక్కువ 40 మెగా పిక్సెల్​ కెమెరాను తమ ఫోన్లలో పొందుపరుస్తున్నాయి.

ఇటీవల షియోమీ 108 మెగా పిక్సెల్ కెమెరా ఫోన్​ను ఆవిష్కరించింది (భారత్​లో విడుదల కావాల్సి ఉంది). మరి దిగ్గజ సంస్థలు భారీ కెమెరాల వైపు ఎందుకు మొగ్గుచూపడం లేదు అంటే.. స్మార్ట్​ ఫోన్లకు 12 మెగా పిక్సెల్​ కెమెరా చాలు అనే సమాధానాలు వినిపిస్తున్నాయి.

స్మార్ట్​ఫోన్లలో 12 మెగా పిక్సెల్​ల కెమెరా చాలు అనేందుకు... ఫోన్​ స్టోరేజీ, ప్రాసెసింగ్​ సమయం, తక్కువ కాంతిలో ఫోటో తీయడం వంటి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇవన్నీ బ్యాటరీ, కెమెరా పనితీరులపై ప్రభావం చూపుతాయి.

ఎక్కువ పిక్సెల్​=ఎక్కువ డేటా..

ఫోన్​ కెమెరా ఎక్కువ మెగా పిక్సెల్​ ఉందంటే.. దానర్థం ఎక్కువ ఫొటోలను ప్రాసెస్​ చేసేందుకు ఎక్కువ డేటాను తీసుకుంటాయి. దీని వల్ల బ్యాటరీ లైఫ్​​ తొందరగా తగ్గిపోతుంది. మరీ ముఖ్యంగా నైట్​ మోడ్​లో ఫొటోలు తీసేటప్పుడు.. పోట్రేట్​​ ఫోటోలకు ఎక్కువ ప్రాసెస్ అవసరం అవుతుంది.

ఫొటోలు ప్రాసెస్​ చేయడం సహా వాటిని స్టోరేజ్​ చేసేందుకూ ఎక్కువ సైజును ఆక్రమిస్తాయి.

ప్రస్తుతం వస్తున్న స్మార్ట్​ఫోన్లలో కొన్ని మోడళ్లు మాత్రమే మెమోరీ కార్డు ద్వారా స్టోరేజీ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. అలాంటి సదుపాయం లేని ఫోన్లు వాడితే.. ఫోన్​లో ఫొటోలను దాచేందుకు క్లౌడ్​ వంటి సదుపాయాలకు ప్రీమియం చెల్లించి వాడుకోవాల్సి వస్తుంది.

అప్​లోడ్​ చేయడమూ సమస్యే..

ఎక్కువ మెగా పిక్సెల్​ కెమెరాతో తీసిన ఫోటోలు ఆన్​లైన్​లో అప్​లోడ్​ చేయాలన్నా ఎక్కువ డేటా, సమయం తీసుకుంటాయి. వైఫైతో కాకుండా.. మొబైల్​ డేటాతో వీటిని అప్​లోడ్​ చేయడం కాస్త ఇబ్బంది కలిగించే విషయమనే చెప్పాలి.

ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయమేంటంటే.. చాలా మంది అల్ట్రా హెచ్​డీ డిస్​ప్లే ఫోన్ల నుంచి పంపిన ఫోటోలను 8.3 మెగా పిక్సెల్ కాన్వాస్​లో మాత్రమే చూడగలుగుతున్నారు.

తక్కువ కాంతి సమయాల్లో 12 ఎంపీ మెగా పిక్సెల్​ కెమెరా, అంతకన్నా పెద్ద సైజు కెమెరాలతో చూస్తే సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వీటికి తోడు మరెన్నో సాంకేతిక కారణాలతో స్మార్ట్​ఫోన్లలో ప్రస్తుతానికి 12 ఎంపీ కెమెరా సరిపోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి:మారుతీ నుంచి మరో చిన్న కారు.. ధర ఎంతంటే?

Special Advisory
Thursday 19th December 2019
Clients, please note that Liverpool's training session at the FIFA Club World Cup in Doha today is no longer open to media. We still expect to have Flamengo footage.
Regards,
SNTV
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.