దేశీయ ఆటోమోబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ.. చిన్న సైజు కారు 'ఆల్టో'లో మరో కొత్త మోడల్‌ను ఆవిష్కరించింది. ఆల్టో వీఎక్స్ఐ ప్లస్ పేరుతో విపణిలోకి వచ్చిన ఈ కొత్త మోడల్ ధరను రూ.3.80 లక్షలు (దిల్లీ ఎక్స్ షోరూం ధర)గా నిర్ణయించింది. ఈ కొత్త మోడల్లో ఏయిరో ఎడ్జ్ డిజైన్, డ్యూయల్ టోన్ ఇంటీరియర్, అధునాతన రక్షణ సదుపాయాలు పొందుపరిచినట్లు మారుతీ సుజుకీ వెల్లడించింది.
17.8 సెంటీమీటర్లతో టచ్‌స్క్రీన్ సదుపాయం కలిగిన.. మారుతీ సరికొత్త స్మార్ట్ ప్లే 2.0 ఈ మోడల్లో పొందుపరిచింది మారుతీ సుజుకీ. దీన్ని యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో వినియోగించుకోవచ్చని ఆ సంస్థ పేర్కొంది.
వీఎక్స్ఐ ప్రత్యేకతలు..
- భారత్ స్టేజ్ (బీఎస్)-6 వేరియంట్ ఇంజిన్
- డ్రైవర్, కో-డ్రైవర్లు ఇద్దరికీ ఎయిర్‌బ్యాక్ సదుపాయం
- స్పీడ్ అలర్ట్ వ్యవస్థ
- సీట్ బెల్ట్ రిమైండర్ వ్యవస్థ
- రివర్స్ పార్కింగ్ సెన్సార్
- అధిక ఇంధన సామర్థ్యం (22.05 కి.మీ/లీటర్)
- ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్టిబ్యూషన్
- యాంటి-లాక్ బ్రేకింగ్ వ్యవస్థ
ఇదీ చూడండి:స్వల్పంగా పుంజుకున్న బంగారం.. నేటి ధరలు ఇవే