చైనా ఎలక్ట్రానిక్ దిగ్గజం షియోమీ 150 ఎంపీ కెమెరాతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ అర్థిక సంవత్సరం చివరి నాటికి కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసే యోచనలో ఉంది షియోమీ.
షియోమీ సంస్థ 2019లో 48 ఎంపీ కెమెరా, 64 ఎంపీ సెన్సార్‌తో రెడ్మీ నోట్-8ప్రో ఫోన్‌ను ప్రారంభించింది. అదే ఏడాది 108 ఎంపీ సెన్సార్‌తో కూడిన సీసీ9 ప్రోను కూడా తీసుకొచ్చింది. తాజాగా 150 ఎంపీ కెమెరా ఫీచర్‌తో మరో కొత్త మోడల్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.
పోటీలో శాంసంగ్..
ఇదిలా ఉండగా శాంసంగ్ ఇప్పటికే 250 మెగా పిక్సెల్ కెమెరా సెన్సార్ ఫోన్‌ను విడుదల చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. వీటన్నిటికీ మించి 600 ఎంపీ రిజల్యూషన్‌తో కూడిన సెన్సార్‌పై కసరత్తు చేస్తున్నట్లు ప్రకటించింది ఈ దక్షిణ కొరియా దిగ్గజం. పోటీని తట్టుకునేందుకే షియోమీ కొత్త మోడల్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇదే తరహా ఫీచర్లతో ఒప్పో, వివో కంపెనీలు 2021 మొదటి త్రైమాసికంలో తమ ఫోన్లను విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: వాట్సాప్‌లో జియోమార్ట్ సేవలు ప్రారంభం