ETV Bharat / business

భారత విపణిలోకి షియోమీ ఎంఐ 11 లైట్​! - redmi 11 lite launch

ఎంఐ 11 లైట్​ స్మార్ట్​ఫోన్​ను​ షియోమీ భారత విపణిలోకి ప్రవేశపెట్టనుంది. ఈ విషయాన్ని ట్విట్టర్​లో ప్రకటించింది. క్వాల్​కామ్​ స్నాప్​డ్రాగన్​ 780జీ ప్రాసెసర్​తో పనిచేసే ఈ ఫోన్​ మంగళవారం విడుదల కానుంది.

Xiaomi Mi 11 Lite, xiaomi mi 11 lite price in india
భారత విపణిలోకి షియోమీ ఎంఐ 11 లైట్​!
author img

By

Published : Jun 21, 2021, 5:07 PM IST

Updated : Jun 21, 2021, 9:56 PM IST

దిగ్గజ స్మార్ట్​ఫోన్​ సంస్థల్లో ఒకటైన షియోమీ.. భారత విపణిలోకి మరో సరికొత్త స్మార్ట్​ఫోన్​ను ప్రవేశపెట్టనుంది. ఎంఐ 11 లైట్​ పేరుతో ఉన్న ఈ మోడల్​ను మంగళవారం (జూన్​ 22) మార్కెట్​లోకి విడుదల చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ ఫోన్​ మూడు రంగుల్లో అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

క్వాల్​కామ్ స్నాప్​డ్రాగన్ 780జీ ప్రాసెసర్​తో అందుబాటులోకి వచ్చిన తొలి ఫోన్ ఇదే కావడం విశేషం.

ఎంఐ 11 లైట్​ ఫీచర్లు..

  • ఇప్పటికే చైనాలో విడులైన ఈ మోడల్​.. రెండు వేరియంట్లలో అక్కడ అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజ్​తో లభిస్తోంది.
  • ఈ స్మార్ట్​ఫోన్​కు ఎఫ్​హెచ్​డీ+ డిస్​ప్లే ఉన్న ​​6.55 ఇంచెన్స్​ ఉన్న స్క్రీన్​ ఉంటుంది.
  • ఇందులోని యూఎఫ్​ఎస్​ 2.2 ​ద్వారా 256 అదనపు స్టోరేజ్​ను పొందవచ్చు. దీనిని మెమొరీ కార్డ్​ సాయంతో 512 జీబీ వరకు పొడిగించుకోవచ్చు.
  • ఈ డివైజ్​కు 20 మెగాపిక్సల్స్​ ఫ్రంట్​ కెమెరా సహా 64 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 8 ఎంపీ అల్ట్రావైడ్​ లెన్స్, 5 ఎంపీ మాక్రో సెన్సార్​లైన మూడు రేర్​ కెమెరాలు కూడా ఉన్నాయి.
  • 33వాట్స్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ ఆప్షన్ ఉన్న ఈ ఫోన్​ బ్యాటరీ సామర్థ్యం 4,250ఎంఏహెచ్​.
  • ఎంఐ 11 లైట్​ మూడు రంగుల్లో అందుబాటులోకి రానుంది. టస్కనీ కోరల్, జాజ్​ బ్లూ, వినైల్ బ్లాక్​ రంగుల్లో లభించనుంది.
    Xiaomi Mi 11 Lite, xiaomi mi 11 lite price in india
    మూడు రంగుల్లో అందుబాటులోకి ఎంఐ 11 లైట్

ధర ఎంతంటే..

భారత్​లో ఈ ఫోన్ ధర ఎంత ఉంటుందని అనే విషయంపై సంస్థ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే చైనాలో ఈ ఫోన్​ ధర 2,299 యువాన్లు (సుమారు రూ.26,415) నుంచి ప్రారంభం అవుతుంది. 8 జీబీ+256 స్టోరేజ్​ వేరియంట్​ ధర అక్కడ 2,599 యువాన్లకు (సుమారు రూ.29,860) అందుబాటులో ఉంది.

ఇదీ చదవండి : ఆ కార్ల ధరలు మరోసారి పెంపు

Last Updated : Jun 21, 2021, 9:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.