ప్రపంచంలోనే శక్తిమంతమైన కేంద్ర బ్యాంక్‌గా ఉన్న భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) మరో ఘనత సాధించింది. అత్యధిక మంది అనుసరిస్తున్న ట్విట్టర్ ఖాతాను కల్గిన కేంద్ర బ్యాంకుగా రికార్డు సృష్టించింది. ఆర్బీఐ ట్విట్టర్ ఖాతాను సుమారు 7,45,000 మంది అనుసరిస్తుండగా.. ప్రపంచంలోని ఇతర దేశాల కేంద్ర బ్యాంకులన్నింటిలో ఇదే అత్యధికం.
2019 మార్చిలో ఆర్బీఐ ట్విట్టర్‌కు ఫాలోవర్లు.. 3,20,000 మంది ఉండగా, 13 నెలల కాలంలో ఈ సంఖ్య రెట్టింపైంది. లాక్డౌన్ ప్రారంభమైన మార్చి 25 నుంచి మరో ఒకటిన్నర లక్షల మంది ఫాలోవర్లు పెరిగారు. 2012 జనవరిలో రిజర్వ్ బ్యాంకు... ఆర్బీఐ పేరుతో ట్విట్టర్ ఖాతాను ప్రారంభించింది.
టాప్-3 లో ఇవే..
ఆర్బీఐ తర్వాత 7,15,000 మంది ఫాలోవర్లతో 'బ్యాంక్ ఇండోనేసియా', 'ఈస్ట్ ఏషియా సెంట్రల్ బ్యాంకు'లు రెండోస్థానంలో నిలిచాయి. 7,11,000 మంది అనుసరిస్తున్న మెక్సికో కేంద్ర బ్యాంక్.. 'బ్యాంకో డీ మెక్సికో' మూడో స్థానంలో నిలిచింది.
ఇదీ చదవండి: వారందరితో డేటాను పంచుకుంటాం: ట్విట్టర్