కరోనాపై పోరుకు తన వంతు సహాయం అందిస్తోంది సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్. ప్రపంచ మహమ్మారిపై మరింత సమాచారం, అవగాహన పొందేందుకు తమ డేటాను పరిశోధకులతో పంచుకోనున్నట్లు ప్రకటించింది. ట్విట్టర్ వేదికగా జరిగే సంభాషణలు.. వారి పరిశోధనలకు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొంది.
వైరస్‌తో కలిగే అనారోగ్యం, అసత్య వార్తలను నిరోధించడం, సంక్షోభంపై సమాచారాన్ని ఒక్క చోటకు చేర్చడం ఈ ప్రాజెక్ట్‌లో భాగం.
"ఇది ప్రతిరోజు కొన్ని మిలయన్ ట్వీట్లను చూడగలిగే ప్రత్యేకమైన డేటా సెట్. ట్విట్టర్లో జరిగే సంభాషణలు ఎంతో ఉపయోగకరమైనవి. కరోనాపై పోరుకు ప్రపంచ దేశాల్లోని ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇవి ఎంతో ఉపయోగపడుతాయి."
- ట్విట్టర్
ఈ డేటాతో శాస్త్రవేత్తలు కృత్రిమ మేథస్సు సాధనాలను రూపొందించవచ్చు. వైరస్‌ను కట్టడి చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. ప్రజా వేదికల్లో జరిగే సంభాషణల ద్వారా అనేక విషయాలు త్వరగా నేర్చుకోవచ్చని, సమస్యలను వేగంగా పరిష్కరించవచ్చని ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సే అభిప్రయాపడ్డారు. ఫలితంగా మహమ్మారిపై పోరులో అందరం కలిసే ఉన్నట్టు ప్రజలకు అర్థమవుతుందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:- ఉద్యోగం కోల్పోతే బీమా హామీ లభిస్తుందా?