ETV Bharat / business

ఉద్యోగం కోల్పోతే బీమా హామీ ల‌భిస్తుందా? - భారత్​లో ఉద్యోగ భద్రత బీమా నిబంధనలు ఏంటి

కొవిడ్-19 సంక్షోభం అన్ని రంగాలను కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు ఉద్యోగాల కోతకు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి సంక్షభ సమయాల్లో ఉద్యోగం పోతే ఎలా? ఉద్యోగ నష్టానికి బీమా ఉందా? అదెలా పని చేస్తుంది? అనే విషయాలు వివరంగా మీ కోసం.

job loss insurance
ఉద్యోగ భద్రత బీమా
author img

By

Published : Apr 30, 2020, 2:58 PM IST

కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్​డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఫలితంగా ఖర్చులు తగ్గించుకునేందుకు వివిధ‌ రంగాల్లో ఉద్యోగాల కోతలు జరుగుతున్నాయి. సంక్షోభ సమయాల్లో ఉద్యోగం పోతే ఆదుకునేందుకు ఉద్యోగ రక్షణ బీమాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఉద్యోగ నష్ట బీమా.. మనదేశంలో ఇంకా ప్ర‌త్యేక పాల‌సీగా అందుబాటులోకి రాలేదు. ఇది జీవిత, ఆరోగ్య, గృహ బీమా పాల‌సీల‌లో ఒక ఫీచ‌ర్‌గా లేదా యాడ్-ఆన్‌గా వస్తుంది.

పరిహారం ఇలా..

కొన్ని పాలసీలు ఉద్యోగ నష్టం వంటి ఊహించని అనేక సంఘటనలకు ఒకేసారి మొత్తాన్ని చెల్లిస్తాయి. వేతనజీవి ఉపాది కోల్పోతే.. ఇలాంటి పాలసీలు నెలకు బీమా చేసిన మొత్తంలో (గరిష్ఠంగా మూడు నెలల వరకు) స్థిరమైన మొత్తాలను (సాధారణంగా 2-3 శాతం) చెల్లిస్తాయి. ఉద్యోగ నష్టానికి బీమా క్లెయిమ్ చేయ‌డానికి 60-90 రోజుల వెయిటింగ్ పీరియడ్ కూడా ఉంది.

వ్యక్తిగత ప్రమాద బీమా విషయంలో..

గాయం లేదా అనారోగ్యం, తాత్కాలిక వైకల్యం కారణంగా పాలసీదారుడు ఉద్యోగం చేయ‌లేని ప‌రిస్థితిలో ఉంటే బీమా మొత్తంలో నిర్ణీత శాతం చెల్లిస్తాయి ఇన్సూరెన్స్ కంపెనీలు. ఇది ముందుగానే నిర్ణయించిన వారాలకు ఆదాయాన్ని భర్తీ చేస్తుంది. కొన్ని తీవ్ర అనారోగ్య సమస్యలతో నిర్దిష్ట సమయం వరకు ఆసుపత్రిలో చేరితే రోజువారీగా నగదు చెల్లిస్తాయి. అయితే ఇది పాలసీ సంవత్సరంలో నిర్ణీత గడువు వరకు మాత్రమే ఉంటుంది.

గృహ రుణ రక్షణ పాల‌సీల్లో ఇలా..

ఈ విధమైన పాలసీల్లో ఉపాధి కోల్పోవడం కారణంగా పాలసీదారుడు గృహ రుణ ఈఏంఐలను చెల్లించలేకపోతే ఉద్యోగ నష్ట కవరేజీ ప్రారంభమవుతుంది. కానీ పాలసీల్లో ఉద్యోగం కోల్పోవడానికి ఒక ప్రత్యేకమైన నిర్వచనం ఉంది. పాలసీదారు పనితీరు లేదా ఇతర క్రమశిక్షణా చర్యల వల్ల ఉద్యోగం కోల్పోతే అలాంటి వారికి బీమా హామీ వర్తించదు. ప్రస్తుత సంక్షోభ సమయాల్లో ఉద్యోగం పోతే మాత్రం హామీ ల‌భిస్తుంది.

ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే.. ఈ యాడ్-ఆన్‌లు సాధారణంగా ఈఎంఐలను మాత్రమే కవర్ చేస్తాయి.

అయితే ఉపాధి కోల్పోతే బీమా పాల‌సీల కోసం చూడ‌కుండా ఎటువంటి ప‌రిస్థితుల‌నైనా ఎదుర్కొనేందుకు ముందుగానే అత్య‌వ‌స‌ర నిధిని ఏర్పాటు చేసుకోవ‌డం మేలు. దీనికోసం అనేక ప‌థ‌కాలు అందుబాటులో ఉన్నాయి.

ఇదీ చూడండి:ఎవరైనా నేర్చుకునేలా యూట్యూబ్​ పాఠాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.