ETV Bharat / business

'చైనీస్'​ పబ్​జీని బ్యాన్​ చేయనిది ఇందుకే...

author img

By

Published : Jun 30, 2020, 3:17 PM IST

గల్వాన్​ ఘర్షణ తర్వాత చైనాకు చెందిన 59 యాప్​లపై వేటు వేసింది భారత ప్రభుత్వం. అయితే ఈ జాబితాలో పబ్​జీ, 360 సెక్యూరిటీ వంటి యాప్​లు లేకపోవడంపై సామాజిక మాధ్యమాల్లో చర్చ నడుస్తోంది. అసలు వాటిని ఎందుకు బ్యాన్​ చేయలేదు?

china apps STILL NOT BANNED IN INDIA?
ఈ చైనా యాప్​లను ఎందుకు నిషేధించలేదు..?

సరిహద్దుల్లో చైనా ఆగడాలకు చెక్​ పెట్టేందుకు డిజిటల్​ యుద్ధానికి తెరతీసింది భారత్​. దేశ సార్వభౌమత్వం, సమగ్రత, ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా ఉన్న టిక్​టాక్​ సహా 59 ప్రధాన మొబైల్​ యాప్​లను నిషేధించింది. అయితే చైనా సంస్థలకు చెందిన పబ్​జీ వంటి కొన్ని ప్రముఖ యాప్​లు మాత్రం ఈ జాబితాలో లేకపోవడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

పబ్​జీని ఎందుకు బ్యాన్​ చేయలేదు..?

భారత్​లో పబ్​జీ బ్యాన్​ చేయకపోవడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. నిఘా సంస్థలు ఇప్పటికే ఈ యాప్​ను సునిశితంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేశాయి. పబ్​జీ వల్ల ప్రస్తుతం ఎలాంటి భద్రతాపరమైన సమస్యలు లేవని గుర్తించినట్లు తెలుస్తోంది.

మరో కారణం ఈ యాప్​ పూర్తిగా చైనా కంపెనీకి చెందినది కాదు. దీన్ని తయారు చేసి యాప్​ నిర్వహణ చూస్తోంది బ్లూ హోల్​ అనే దక్షిణ కొరియా సంస్థ. అయితే ఈ గేమ్​ బాగా పేరు తెచ్చుకున్నాక చైనాకు చెందిన టెన్సెంట్​ సంస్థ.. బ్లూ హోల్​తో కలిసింది. చైనా, భారత్​లో ఈ గేమ్​ను మార్కెటింగ్​ వ్యవహారాలను టెన్సెంట్​ చూసుకుంటోంది. ఇలా మిక్స్​డ్​ ఓనర్​షిప్​ వల్ల ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు.

ప్రస్తుతం కొన్ని యాప్​లతో ఎటువంటి ఇబ్బందులు లేకపోగా.. మరికొన్ని వాటిపై ఇంకా రివ్యూ కొనసాగుతోంది. భవిష్యత్తులో వాటిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

జాబితాలో లేని చైనా యాప్​లు...

నిషేధిత జాబితాలో చోటు దక్కించుకోని కొన్ని ప్రముఖ చైనా యాప్​లు ​ఇవే..

  • పబ్​జీ మొబైల్​
  • ఎంవీ మాస్టర్​
  • అలీఎక్స్​ప్రెస్​
  • టర్బో వీపీఎన్​
  • యాప్​ లాక్​ బై డూమొబైల్​
  • రాజ్​ బజ్​ వుయ్​ మీడియా
  • 360 సెక్యూరిటీ
  • యాప్​లాక్స్​
  • నానో లైవ్​
  • గేమ్​ ఆఫ్​ సుల్తాన్స్​
  • మాఫియా సిటీ
  • బ్యాటిల్​ ఆఫ్​ ఎంపైర్స్​

ఇప్పటికే నిషేధించిన 59 యాప్​ల్లో కొన్నింటిని భారత్​లోని ప్లే స్టోర్, ఐ స్టోర్​ల నుంచి తొలగించాయి గూగుల్​, యాపిల్​ సంస్థలు.

ఇవీ చూడండి:

  1. చైనా యాప్​లకు ఇవి ప్రత్యామ్నాయం.. ట్రై చేయండి!
  2. చైనా ఫోన్లు వద్దా.. ఈ మోడళ్లపై లుక్కేయండి!
  3. నిషేధంతో టిక్​టాక్​ సంస్థకు రోజుకు ఎంత నష్టం?
  4. చైనా 'షేరిట్​'ను తలదన్నే స్వదేశీ యాప్​ వచ్చేసింది!
  5. టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా చింగారీ యాప్..​
  6. చైనా తీరు నచ్చట్లేదా.. 'రిమూవ్‌ చైనా యాప్స్'
  7. జూమ్​ యాప్​కు దీటుగా ఫేస్​బుక్ 'మెసెంజర్​ రూమ్స్​​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.