ETV Bharat / business

ఆరోగ్య సంజీవని పాలసీ గురించి తెలుసా? - వ్యాపార వార్తలు

సామాన్యులందరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ 'ఐఆర్‌డీఏ' ఓ ప్రత్యేక పాలసీ అందుబాటులోకి తెచ్చింది. దాని పేరే ఆరోగ్య సంజీవని. అన్ని సంస్థలు ఇదే పేరుతో పాలసీని అందిస్తున్నాయి. ఈ పాలసీకి సంబంధించిన పూర్తి సమాచారం, ఉపయోగాలు వివరంగా మీ కోసం.

what Arogya Sanjeevani Policy
ఆరోగ్య సంజీవని పాలసీ
author img

By

Published : Apr 19, 2020, 11:12 AM IST

అనుకోని ప్రమాదం.. తీవ్ర అనారోగ్యం.. కారణమేదైనా సరే.. ఆసుపత్రిలో చేరితే బిల్లు లక్షల రూపాయల్లోనే.. ఇలాంటప్పుడే ఆరోగ్య బీమా అవసరమేమిటో తెలుస్తుంది. మనకేమి అవసరం అనుకుంటూ.. చాలామంది ఇప్పటికీ దీన్ని తీసుకునేందుకు ఇష్టపడరు. ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఒక ఆరోగ్య బీమా ఉండాలనే లక్ష్యంతోపాటు.. సామాన్యుల అవసరాలకు తగ్గట్టుగా ఒక పథకం ఉండాలని భావించిన ఐఆర్‌డీఏ ప్రత్యేకంగా ఓ ప్రామాణిక ఆరోగ్య బీమా పాలసీని రూపొందించింది. ఇటీవలే అందుబాటులోకి వచ్చిన ఈ పాలసీ పేరు ఆరోగ్య సంజీవని. అన్ని సాధారణ బీమా సంస్థలు ఈ పాలసీని ఇదే పేరుతో అందిస్తున్నాయి.

అందుబాటులో ఎన్నో ఆరోగ్య బీమా పాలసీలున్నాయి. ఒక పాలసీకి మరో దానికీ సంబంధం లేదన్నట్లుగా ఉంటుంది. వీటిలో నిబంధనలను అర్థం చేసుకోవడమూ అంత తేలికేమీ కాదు. బీమా సంస్థలను బట్టి, ఆయా నియమాలు మారుతుంటాయి. ఇలాంటి గందరగోళానికి తావులేకుండా ఏ సంస్థ నుంచి ఈ ఆరోగ్య సంజీవని పాలసీ తీసుకున్నా.. నియమ నిబంధనలు, షరతులన్నీ ఒకే విధంగా ఉంటాయి. ప్రీమియాన్ని నిర్ణయించుకునే స్వేచ్ఛ బీమా సంస్థలకు ఉంటుంది.

ఎంత మొత్తం?

పాలసీదారుల కనీస అవసరాలను తీర్చే విధంగా ఈ పాలసీ ఉండాలనేది ఐఆర్‌డీఏ లక్ష్యం. అందుకే, కనీస మొత్తం రూ.లక్ష నుంచి అందుబాటులో ఉంది. రూ.50వేల చొప్పున పెంచుకుంటూ.. గరిష్ఠంగా రూ.5లక్షల వరకూ పాలసీని తీసుకోవచ్ఛు వ్యక్తిగతంగానూ, కుటుంబం అంతటికీ కలిపి ఫ్లోటర్‌ పాలసీగానూ దీన్ని ఎంచుకోవచ్ఛు.

అర్హత

18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వయసు వారి పేరుమీద పాలసీని జారీ చేస్తారు. జీవితాంతం వరకూ పునరుద్ధరించుకోవచ్ఛు కుటుంబం మొత్తానికీ కలిపి ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీని ఎంచుకున్నప్పుడు.. జీవిత భాగస్వామితో పాటు, తల్లిదండ్రులు, అత్తామామల పేర్లనూ పాలసీలో చేర్పించవచ్ఛు 3 నెలల వయసు నుంచి 25 ఏళ్ల వరకూ వయసున్న పిల్లలను పాలసీ రక్షణ పరిధిలోకి తీసుకురావచ్ఛు ఒకవేళ పిల్లల వయసు 18 ఏళ్లు దాటి, సొంతంగా సంపాదన ఉంటే వారికి ప్రత్యేకంగా పాలసీ తీసుకోవాల్సి వస్తుంది.

45 ఏళ్ల లోపు వారికి ఎలాంటి వైద్య పరీక్షలు అవసరం లేకుండానే పాలసీ ఇస్తారు. 45 ఏళ్లు దాటిన వారికి కొన్ని ముఖ్యమైన ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు.

పాలసీ వ్యవధి:

ఈ పాలసీ ఏడాది పాటు అమల్లో ఉంటుంది.

ప్రీమియం చెల్లింపు..

ఆరోగ్య సంజీవని తీసుకున్నప్పుడు ప్రీమియం చెల్లింపులో వీలైనంత వెసులుబాటు కల్పించాలని ఐఆర్‌డీఏ పేర్కొంది. దీని ప్రకారం నెలనెలా, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది వ్యవధులతో ప్రీమియాన్ని చెల్లించే వీలుంది. వ్యవధి తీరిన తర్వాత 30 రోజులపాటు ప్రీమియం చెల్లించేందుకు అదనపు వ్యవధీ ఉంటుంది.

సహ చెల్లింపు

క్లెయిం చేసుకున్న ప్రతి సందర్భంలోనూ తప్పనిసరిగా 5శాతం సహ చెల్లింపు (కో పేమెంట్‌) వర్తిస్తుంది. ఉదాహరణకు ఆసుపత్రి బిల్లు రూ.50,000 అయ్యిందనుకోండి.. అందులో రూ.2,500 వరకూ మనం చెల్లించాల్సి వస్తుంది. దీంతోపాటు కొన్ని ఉప పరిమితులూ ఉన్నాయి. ఐసీయూలో చేరినప్పుడు రోజుకు పాలసీ మొత్తంలో 5 శాతం, గరిష్ఠంగా రూ.10వేలు మాత్రమే ఇస్తుంది.

బోనస్

పాలసీని క్లెయిం చేసుకోకపోతే.. ఏటా 5శాతం చొప్పున బోనస్‌ అందుతుంది. ఇలా గరిష్ఠంగా 50శాతం వరకూ బోనస్‌ లభిస్తుంది.

వేచి ఉండే వ్యవధి

కొన్ని రకాల చికిత్సలకు తప్పనిసరిగా వేచి ఉండే సమయం నిబంధన వర్తిస్తుంది. ఇందులో కొన్నింటికి 24 నెలలు ఉండగా.. మోకీలు మార్పిడి వంటి వాటికి కనీసం 48 నెలల తర్వాతే అనుమతిస్తారు.

అధునాతన వైద్యానికీ..

అందుబాటులోకి వచ్చిన అధునాతన రోబోటిక్‌ శస్త్ర చికిత్సల్లాంటి వాటికీ పరిహారం లభిస్తుంది. పాలసీ మొత్తంలో గరిష్ఠంగా 50శాతం వరకూ చెల్లిస్తారు. ఆయుష్‌ వైద్య విధానంలో చేసుకునే చికిత్సలకూ ఇందులో పరిహారం లభిస్తుంది. కరోనా చికిత్సకూ ఇది వర్తిస్తుంది.

దాదాపు సాధారణ బీమా సంస్థలూ ఈ పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చాయి. నిబంధనలు ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ఆయా బీమా సంస్థల క్లెయిం చెల్లింపుల చరిత్ర, ప్రీమియాన్ని గమనించి ఎక్కడ పాలసీ తీసుకోవాలన్నది నిర్ణయించుకోవాలి.

ఇదీ చూడండి:కరోనా సంక్షోభం నేర్పే ఆర్థిక పాఠాలు ఇవే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.