ETV Bharat / business

కరోనా సంక్షోభం నేర్పే ఆర్థిక పాఠాలు ఇవే... - బిజినెస్ వార్తలు

లాక్‌డౌన్‌.. క్వారంటైన్‌.. ప్రస్తుతం మనకు కరోనా వైరస్‌ నేర్పిన కొత్త పదాలివి. ఈ మహమ్మారి బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునేందుకు.. ఇంట్లోనే ఉంటూ మన భవిష్యత్తు గురించి ఆలోచించుకునే అవకాశాన్నీ ఇచ్చింది. ఈ కొవిడ్‌-19 సృష్టించిన సంక్షోభం మనం సాధారణంగా విస్మరించే ఆర్థిక అంశాలనూ ఒకసారి గుర్తుచేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొంటూనే.. మున్ముందు ఇలాంటివి వచ్చినా ఆర్థికంగా ఎలా సన్నద్ధంగా ఉండాలనే అంశంపై ఆర్థిక నిపుణుల సలహాలు మీ కోసం.

economic advice in corona crisis
కరోనా ఆర్థిక పాఠాలు
author img

By

Published : Apr 19, 2020, 10:16 AM IST

Updated : Apr 19, 2020, 10:31 AM IST

కరోనాకు ముందు.. కరోనా తర్వాత.. ఇక నుంచి ప్రతీదీ ఇలాగే ఆలోచించాల్సిన అవసరం ఉంటుందని వింటూనే ఉన్నాం.. వాస్తవానికి ప్రతి ఒక్కరి ఆలోచనా ధోరణిలోనూ కొంత మార్పు కనిపిస్తోంది. వృథా ఖర్చులకు కళ్లెం వేయడం దగ్గర్నుంచి.. ఆర్థిక భరోసా కోసం మంచి ప్రణాళిక సిద్ధం చేసుకోవడంలాంటివన్నీ ఇప్పుడు మన ముందున్న ప్రధాన కర్తవ్యం.

12 నెలల ఖర్చులు..

ఆర్థికంగా మనం ఎంత మెరుగ్గా ఉన్నామన్న సంగతి కరోనా బయటపెట్టిందనే చెప్పాలి.. చాలామంది ఆదాయంలో ఈ నెల తగ్గుదల కనిపించింది. ఇది కొంత ఆందోళనకరమే. ఆర్థిక మాంద్యం, ఉద్యోగాల కోతలాంటివి ఎదురైతే పరిస్థితి ఏమిటి? దీనిని తట్టుకునే శక్తి మనకుందా? ఒకసారి ఆలోచించుకోవాలి. అత్యవసర నిధి అవసరం గురించి మనం ఎన్నో సందర్భాల్లో అనుకుంటూనే ఉంటాం. కానీ, ఆచరణలో మాత్రం దీన్ని పట్టించుకోం. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా.. కనీసం 6 నెలల ఖర్చులు, రుణ వాయిదాలు, ఆరోగ్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిధిని సమకూర్చుకోవాలి. ఉద్యోగంలో కొంత ఇబ్బంది రావచ్చు అనుకున్నవారు.. ఈ మొత్తం కనీసం 12 నెలల వరకు ఉండేలా చూసుకోవాలి. ఈ నెల నుంచి నిత్యావసరాలకు తప్ఫ. ఇతర ఖర్చులేమీ చేయకుండా.. మిగిలిన మొత్తమంతా.. అత్యవసర నిధికి మళ్లించండి.

రుణాలకు దూరం...

ఇప్పటి నుంచి కనీసం ఏడాది వరకూ కొత్త రుణాలేమీ చేయకండి. ముఖ్యంగా అంతగా అవసరం లేని వస్తువులను అప్పు చేసి మరీ కొనొద్ధు అనుకోని పరిస్థితుల్లో మీ ఆదాయం ఆగిపోయే పరిస్థితి వస్తే.. ఇది మీకు నెలనెలా భారం అవుతుంది. మరీ తప్పదు అనుకుంటేనే అప్పు చేయండి.

రాయితీలతో జాగ్రత్త..

కరోనా లాక్‌డౌన్‌ ముగిసిన వెంటనే షాపింగ్‌ మాల్స్‌ నుంచి ఇ-కామర్స్‌ వెబ్‌సైట్ల దాకా భారీ రాయితీలతో విక్రయించేందుకు ముందుకు వస్తాయని చెప్పొచ్ఛు వీటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీకు ఏవి కావాలో అవే తీసుకోండి. తక్కువ ధరకు వస్తున్నాయి కదా.. అని సమీప భవిష్యత్తులో ఉపయోగపడని వాటి జోలికి వెళ్లకండి. జీవన శైలి ఖర్చులనూ వీలైనంత కట్టడి చేయాలి.

మదుపు కొనసాగాలి..

మీ దగ్గర అధికంగా ఉన్న డబ్బును పెట్టుబడి పెట్టడానికి ఇది అనువైన సమయం. స్టాక్‌ మార్కెట్లో భయాందోళనలు, ఆర్థిక మాంద్యం పరిస్థితులు నెలకొన్నప్పుడు ఈక్విటీలు, ఈక్విటీ ఆధారిత పథకాల్లో మదుపు చేస్తే.. కాలం కలిసొచ్చినప్పుడు లాభాలు సంపాదించే వీలుంటుంది. మంచి నాణ్యమైన షేర్లు ఇప్పుడు అందుబాటు ధరల్లోనే ఉన్నాయి. మీకు షేర్ల గురించి అంతగా అవగాహన లేకపోతే.. మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేయండి.

నైపుణ్యాలను పెంచుకోండి..

ఉద్యోగాల తీరు మారుతోంది.. ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికత వస్తోంది. వీటిన్నింటి గురించీ తెలుసుకొని, నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ప్రతి ఉద్యోగికీ ఇప్పుడు తప్పనిసరి. ప్రస్తుత కాలంలో వీటికి పదును పెట్టుకోండి. మీరు ఇప్పటికే చేస్తున్న పనిలో మీ బలాలు, బలహీనతలు మీకు తెలిసే ఉంటాయి. మీ బలహీనతలను తగ్గించుకొని, బలాలను పెంచుకోండి. మీరు పనిచేస్తున్న సంస్థకు మీరు ముఖ్యమైన వ్యక్తిగా మారాలి. అప్పుడే మీకు ఉద్యోగ భద్రత గురించి ఆందోళన, ఆదాయం తగ్గుతుందన్న బెంగ అవసరం ఉండదు.

- సాయి కృష్ణ పత్రి, సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌

బీమా ఉందా?

ఇప్పటికే ఉన్న బీమా పాలసీలను సమీక్షించుకొని, అవసరాన్ని బట్టి, వాటిని పెంచుకునేందుకు ఇదే సరైన సమయం. మీ వార్షికాదాయానికి కనీసం 12 రెట్ల వరకూ టర్మ్‌ బీమా పాలసీ ఉండేలా చూసుకోండి. కుటుంబం అంతటికీ వర్తించేలా ఆరోగ్య బీమా పాలసీ ఉండాలి. వీటితోపాటు వ్యక్తిగత ప్రమాద బీమా, డిజేబిలిటీ ఇన్సూరెన్స్‌, తీవ్ర వ్యాధులకు వర్తించే క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీలూ తప్పనిసరి. ఇప్పటికే ఉన్న పాలసీలకు సంబంధించిన పత్రాలన్నీ అందుబాటులోనే ఉన్నాయా చూసుకోండి. లాక్‌డౌన్‌ కొనసాగుతున్నందున ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి, మన పెట్టుబడులు, ఆర్థిక పరిస్థితి గురించి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నించండి.

డిజిటల్‌ చెల్లింపులతో..

భౌతిక దూరం పాటించడమే కరోనా కట్టడికి ఇప్పుడున్న ఏకైక మార్గం. అందువల్ల మీరు బ్యాంకింగ్‌ లావాదేవీలు నిర్వహించేందుకు బ్యాంకు శాఖలకు వెళ్లకండి. మీ అవసరాలకు ఆయా బ్యాంకుల యాప్‌లను వినియోగించుకోండి. ఈఎంఐల చెల్లింపు, సిప్‌, ఇన్సూరెన్స్‌ ప్రీమియంలాంటివన్నీ డిజిటల్‌ మార్గంలోనే చెల్లించండి.

వీలైతే చెల్లించండి..

ఆర్‌బీఐ ఆదేశాల ప్రకారం బ్యాంకులు అన్ని రకాల రుణాలు, క్రెడిట్‌ కార్డుల బిల్లులపై మూడు నెలల మారటోరియం విధిస్తున్నాయి. ఈ సమయంలో చెల్లించాల్సిన వడ్డీని బాకీ ఉన్న అసలులో కలిపేస్తాయి. అంటే, కొత్తగా మనం అప్పు తీసుకున్నట్లే అవుతుంది. ఆదాయంలో కొంత అనిశ్చితి ఉన్నవారు ఈ మారటోరియాన్ని వినియోగించుకోండి. డబ్బులకు ఇబ్బంది లేదు అనుకుంటే.. రుణ వాయిదాలను ఆపకుండా చెల్లించడమే మేలు. క్రెడిట్‌ కార్డు బిల్లులకూ దాదాపు 36-49.36శాతం వరకూ వడ్డీ విధిస్తుంటారు. కాబట్టి, ఈ బిల్లులనూ బాకీ పెట్టకండి. అధిక మొత్తంలో ఉన్న బిల్లును వీలైతే ఈఎంఐలోకి మార్చేయండి.

(నవీన్‌ కుక్రెజా, సీఈఓ, Paisabazaar.com)

ఇదీ చూడండి:చైనాకు భారత్‌ షాక్‌-ఎఫ్‌డీఐ నిబంధనలు మరింత కఠినం

Last Updated : Apr 19, 2020, 10:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.